భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి అని చెప్పాలి. ఒకసారి మూడుముళ్ల బంధం తో దాంపత్య బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలకాలం కలిసి ఉండాలి. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యా భర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. ఇక ఒకప్పటి లాగానే పెళ్లి చేసుకొని దాంపత్య బంధం లోకి అడుగు పెడుతున్నారు.


 కానీ ఒక్కరి అభిరుచిలు ఒకరు తెలుసుకొని కలిసి ఉండడానికి లేదా కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడగా ఉండడానికి మాత్రం ఇష్ట పడటం లేదు. దీంతో చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకోవడం లేదంటే కట్టుకున్న వారిని దారుణం గా హతమార్చడం జరుగుతుంది. యువకులు కొత్తగా పెళ్లి చేసుకోవాలి అంటే ఇలాంటి ఘటనలని చూసిన తర్వాత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసి షాక్ అవుతున్నారు ఎంతో మంది. భర్తపై కోపంతో భర్త నాలుకను కొరికేసింది భార్య.


 ఈ ఘటన యూపీ లోని లక్నో  లో వెలుగు చూసింది అని చెప్పాలి.  భార్య చేసిన పనికి ఏకం గా భర్త నాలుక తెగిపడింది అని చెప్పాలి. భర్త మున్నా భాయ్ తో గొడవల కారణం గా భార్య సల్మా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటుంది అని చెప్పాలి. అయితే భార్య పిల్లల్ని తీసుకురావడానికి భర్త ఇటీవలే అత్తారింటికి వెళ్లాడు. తనతో రమ్మని భార్యను కోరాడు. కానీ ఆమె మాత్రం భర్తతో వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే కోపంతో ఊగిపోయిన సల్మా మున్నా నాలుక నోటితో కొరికేసింది. ఈ ఘటనతో అతని నాలుక తెగిపడిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: