ప్రేమ గుడ్డిది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది. అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత ప్రేమ గుడ్డిది అని తెలుసు. కానీ మరి ఇంత గుడ్డిది అని మాత్రం అనుకోలేదు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రేమ అనే మాయలో పడిపోయిన ఎంతో మంది యువతి యువకులు చేస్తున్న పిచ్చి పనులు ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఏదైనా చేసి ఇక తమ ప్రేమించిన వారిని దక్కించుకోవాలి అనుకునేవారు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం నేటి రోజుల్లో కనిపిస్తూ ఉంది.


 ఏకంగా ప్రేమించిన వారు దక్కలేదు అన్న కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు కొంతమంది కనిపిస్తూ ఉంటే.. తమ ప్రేమను రిజక్ట్ చేసిన కారణంతో ఏకంగా ప్రాణంగా ప్రేమించిన వారిని దారుణంగా హతమారుస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక మరోవైపు ప్రేమించిన వారిని దక్కించుకునేందుకు నీచమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి కొంతమంది. ఇక్కడ ఒక అమ్మాయి ఇలాంటిదే చేసింది. ఏ ఆడపిల్ల చేయని పని చేసి ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది అని చెప్పాలి.


 ఇటీవల తమిళనాడులోని చెంగల్పట్టులో గ్యాంగ్ రేప్ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ కేసును ఎంతో సవాలుగా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలను రాబట్టారు అని చెప్పాలి. చెన్నయ్ కు చెందిన యువతి సలీం అనే యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అడగగా అతను మాత్రం అంగీకరించలేదు. దీంతో అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న యువతి ఫ్రెండ్స్ తో కలిసి సలీం తనను గ్యాంగ్ రేప్ చేశాడంటూ ఒక సీన్ క్రియేట్ చేసింది. ఇక చెంగల్ పట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో మాత్రం అదంతా కేవలం ఒక నాటకం మాత్రమే అన్న విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: