నాన్ వెజ్ ప్రియులలో చాలామందికి ప్రతి రోజు నాన్ వెజ్ తినాలని అనిపిస్తుంది. అయితే ప్రతి రోజు అంటే అందరికి చాలా కష్టం. అందుకే నిల్వ ఉండేలాగా చికెన్ తో పచ్చడి చేసుకుంటే మీకు  ఎప్పుడు కావలిస్తే అప్పుడు వేసుకుని తినవచ్చు.. ఈ చికెన్ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. దీనికి కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దాం.. !!
 కావలసిన పదార్థాలు:

1)చికెన్ -1kg
2)ఉప్పు       - ముప్పావుకప్పు,
3)గసగసాలు   - 3  టేబుల్ స్పూన్స్
4)అల్లం        - 50 గ్రాములు ,
5)వెల్లుల్లి      -పావుకిలో
6)నిమ్మరసం  -అరకప్పు
7)జీలకర్ర      -2  టీ స్పూన్
8)మెంతిపొడి -టీ స్పూన్
9)జీలకర్ర    -టీ స్పూన్
10)ఆవాలు   -2 టీ స్పూన్
11)పసుపు   -  టీ స్పూన్
12)నూనె     - సరిపడా
13)కారం -సరిపడా

మషాలా కోసం :    

ధనియాలు 3 టేబుల్ స్పూన్స్,  లవంగాలు 6, దాల్చిన చెక్క 2 అంగుళాలముక్కా, యాలుకలు టీ స్పూన్  ,   అనాసపువ్వు 1,ఇవన్నీ ఓ రెండు నిముషాలు వేయించి చల్లారాక పొడి చేయాలి.
 
తయారు చేయువిధానం :


గసగసాలు వేయించి మిక్సీ లో వేసి మెత్తగా అయ్యాక అల్లం వెల్లుల్లి కూడా వేసి తిప్పాలి.చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టాలి.ఇప్పుడు బాండీలో అరకిలో నూనె  పోసి ముక్కల్ని కొంచం కొంచెంగా మీడియం మంటమీద బాగా వేగనివ్వాలి. బాణలిలో 5/6 టేబుల్ స్పూన్స్ నూనె  మాత్రమే ఉంచి ఆవాలు జీలకర్ర వేసి వేయించి తరువాత అల్లం వెల్లుల్లి ముద్దా వేసి పసుపు,  గరం మషాలా,  వేసి బాగా వేయించి చల్లారనివ్వాలి.ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో కారం  ఉప్పు జీలకర్ర పొడి మెంతుపొడి వేసి కలపాలి. ఆరిన తరువాత వేయించిన  పోపు చికెన్ ముక్కలు వేసి బాగా తిప్పాలి చివరగా నిమ్మరసం వేసి తిప్పాలి 2  రోజుల తరువాత ముక్క బాగా వురి చాలా బాగుంటుంది.. ఒక్కసారి ట్రై చేసి చుడండి..

మరింత సమాచారం తెలుసుకోండి: