పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం పొలికెపాడు గ్రామానికి చెందిన మంకలి నర్సయ్య, కాశమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు కురుమయ్య, శివ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అదే గ్రామానికి చెందిన రేణుక అనే యువతితో శివకు ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేశారు.
అయితే పెళ్లయిన కొద్ది రోజుల నుంచే అత్తాకోడళ్ల మధ్య నిత్యం యుద్ధమే జరుగుతూ ఉండేది. ఇక మాటలతో దుర్భాషలాడుకునేవారు. గొడవ పడొద్దని ఇంట్లో వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా ఎవరి మాట వినేవాళ్లు కాదు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై శివకు తీవ్ర ఆగ్రహం ఉండేది. శుక్రవారం రాత్రి కూడా ఓ విషయంలో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. గొడవ పడొద్దని వారించినా ఎవరు వినలేదు.
ఇక ఈ గొడవ గురించి మనస్తాపం చెందిన కాశమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుంది. నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కోడలు అత్తచేతిలోని అగ్గిపెట్టెను లాక్కుంది. ఈ పరిణామాలతో ఒక్కసారిగా శివలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లి మెడపై నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే మృతి చెందింది. ఇక స్థానికుల సమచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇక శివ, అతడి భార్య రేణుకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి