ఈ మధ్యకాలంలో దొంగలూ ఎక్కడ చూసినా దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో రోజురోజుకీ దొంగల భయం అందరిలో  పెరిగిపోతూనే ఉంది. ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలి అంటేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే తిరిగి వచ్చేసరికి ఎక్కడ ఇంటిపై దొంగలు పడి దోచుకు పోతారో అని అందరూ వణికిపోతున్నారు. అంతలా ప్రస్తుతం దొంగలు బీభత్సం సృష్టించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలలో కూడా దొంగలు దోపిడీలకు పాల్పడుతు అందినకాడికి దోచుకుంటున్నారు.


 సాధారణంగా దొంగలు చోరీకి చేయాలి అనుకున్న సమయంలో.. పక్కా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు.. ఇక ఈ ప్లాన్ ప్రకారమే చోరికి పాల్పడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం దొంగలకు ఊహించని షాక్ లు తగులుతు ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ లో దోపిడీ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు దొంగలు కూడా చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం ముత్తూట్ ఫైనాన్స్ భవనంలోకి ప్రవేశించినప్పటికీ చివరికి  ఊహించని షాక్ తగిలింది.. ఈ ఘటన సికింద్రాబాద్ లోని తిరుమలగిరి లో వెలుగులోకి వచ్చింది.


 మహారాష్ట్ర అయోధ్య నగర్ కు చెందిన లక్ష్మణ్ ముంబైకి చెందిన అశోక్ మహారాష్ట్రకు చెందిన బాలకృష్ణన్ ముగ్గురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు.. ఈ క్రమంలోనే భారీ దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకున్నారు. ఇటీవలే ఉదయం 9 గంటల ప్రాంతంలో తిరుమలగిరిలోని ఆర్టీసీ కాలనీ లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ భవనంలోకి చొరబడ్డారు.  అయితే చాలా సేపటినుంచి అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు ముఠాగా కనిపించడంతో ఇక ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి సూచికగా వుండే అలారాన్ని మోగించారు. దీంతో ఇక ముత్తూట్ ఫైనాన్స్ భవనం నుండి ముగ్గురు నిందితులు బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు వారిని పట్టుకునేందుకు వెంబడించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వారిని పట్టుకున్నారు.. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: