ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మైదానంలోకి ఏదో ఒక ఆట ఆడుకునేవారు. ఇక ఇప్పుడు కూడా అలాగే ఆడుకుంటున్నారు. కానీ మైదానంలోకి వెళ్లి కాదు అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే. ఇటీవలి కాలంలో వచ్చే నెల నుంచి పెద్దల వరకు అందరూ కూడా అటు ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టారు. క్రమంగా ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఎంతో మందిని బానిసలుగా మార్చుకున్న ఆన్ లైన్ గేమ్ లలో అటు పబ్జి  కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 పబ్జి కి బానిసలుగా మారిపోయి పిచ్చివాళ్ళలా మతిస్థిమితం కోల్పోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. పబ్జి ఊబిలో కూరుకుపోయి చివరికి ఎంతో మంది ని హత్య చేసిన వారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆన్ లైన్ లో పబ్ జి గేమ్ ఆడటం ఏకంగా ఒక మహిళ ప్రాణం పోవడానికి కారణమైంది. కొడుకు పబ్జి గేమ్ ఆడటం తో తల్లి ప్రాణం గాలిలో కలిసిపోయింది   పబ్జి గేమ్ ఆడటం వల్ల ప్రాణం పోవడం ఏంటి అంతా కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొడుకు పబ్జి ఆడుతూ బానిసగా మారిపోవడంతో తండ్రి అతని మందలించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇక పెద్ద వివాదంగా మారి పోయింది. అయితే కొడుకు ఎదురు చెప్పడంతో కోపంతో ఊగిపోయిన తండ్రి ఇంతియాజ్ కుమారుడు చంపేస్తానంటూ  తుపాకీ పట్టుకున్నాడు. అదే సమయంలో అతనికి తల్లి అడ్డుపడింది. ఇక మద్యం మత్తులో ఇంతియాజ్ తుపాకీతో కాల్చడంతో.. తల్లి ఛాతిలో బులెట్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటక లోని చిక్మంగళూరు లో చోటుచేసుకుంది.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: