
అత్యంత భయంకరంగా ఏనుగు దాడికి పాల్పడుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది పర్యటకులు అడవుల్లోకి వెళ్లి జంతువులను దగ్గర నుంచి చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తున్నారు. అయితే ఇలా అడవుల్లోకి వెళ్లి జంతువులను చూడాలి అనుకునే కోరిక తప్పు కాకపోయినప్పటికీ ఎందుకో జంతువుల ప్రైవసీని మాత్రం పర్యటకుల దెబ్బతీస్తున్నారు అని చెప్పాలి. దీంతో ఇటీవల కాలంలో అడవుల్లోకి వెళ్తున్న ఎంతో మంది పర్యటకులపై జంతువులతో చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏనుగులు పర్యటకుల వాహనాలపై దాడి చేయడం చూస్తూ ఉన్నాం.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కేరళలోని వాయనాడ్ జిల్లాలో ఒక అడవిలోకి వెళ్లారు పర్యటకులు. అయితే అక్కడే ఒక భారీ ఏనుగు ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది. ఇంతలో అతను వచ్చి ఆ భారీ ఏనుగును ఇబ్బంది పెట్టాడు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఏనుగు ప్రైవసీ దెబ్బతింది. దానికి కోపం వచ్చేసింది. ఇక అతన్ని కొత్త దూరం వరకు వెంబడించింది. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సదరు వ్యక్తి పరిగెత్తాడు. ఏనుగు అతనిపై దాడి చేసేందుకు వస్తుంటే వాహనంలో ఉన్న టూరిస్టులు సైతం షాక్ అయ్యారు. ట్విట్టర్లో ఈ వీడియో వైరల్ గా మారింది.