ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ అనే మాయలో గడిపేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి ఇక ఇంటర్నెట్లో గంటల తరబడి గడుపుతున్న వారు ఒక్క దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కనిపిస్తున్నారు. అదే సమయంలో ఒకప్పుడు కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు మైదానంలోకి వెళ్లి అక్కడ ఏదో ఒకటి ఆటలు ఆడటం చేసేవారు. చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఇలా మైదానంలోనే ఆటలు ఆడుతూ ఉపశమనం పొందేవారు. కానీ ఇప్పుడు ఎవరికి ఆ అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే అందరూ ఆన్లైన్ గేమ్స్ కి బాగా అలవాటు పడిపోయారు.



 మైదానంలోకి వెళ్లి కష్టపడటం ఎందుకు.. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఎంతో స్మార్ట్ గా చెమట చుక్క చిందించకుండా గేమ్స్ ఆడొచ్చు కదా అని భావిస్తూ చివరికి ఆన్లైన్ గేమ్స్ కి బానిసలుగా మారిపోతున్నారు. వెరసి ఇక ఆన్లైన్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ఖాతాలు ఖాళీ చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులు ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో  ఇరుక్కొని చివరికి దారుణంగా మోసపోతున్నారు. తద్వారా చివరికి మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక ఇప్పుడూ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లోనే  నెల్లూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దత్తలూరు మండలం తురకపల్లికి చెందిన కవిత అనే విద్యార్థిని బి ఫార్మసీ చదువుతుంది. అయితే ఇటీవల కాలేజీ ఫీజు కోసం తల్లిదండ్రులు 2.5 లక్షలు ఇచ్చారు. అయితే ఇక ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఆన్లైన్ గేమ్ లో బెట్టింగ్ పెట్టి చివరికి పోగొట్టుకుంది. అయితే తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురైంది కవిత. ఈ క్రమంలోనే ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: