
దీంతో నేటి రోజుల్లో ఏ కారణంతో ఎలాంటి దారుణం జరుగుతుందో అని ఊహించడం కూడా కష్టంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఎవరి నుండి ప్రమాదం పొంచి ఉంటుందో అని అందరూ భయపడుతూనే బ్రతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి ఓ దారుణమే వెలుగు చూసింది. ఏకంగా అతి చిన్న విషయం హత్యకు దారి తీసింది. బిర్యానీ విషయంలో జరిగిన గొడవ ఒకరి హత్యకు కారణమైంది.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 సార్లు విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు నిందితుడు. ఢిల్లీలోని వెల్కం ఏరియాలో 18 ఏళ్ల యువకుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే అతనిపై పదహారేళ్ళ బాలుడు ఒక్కసారిగా దాడి చేశాడు. కాగా బాధితుడు ప్రతికటించడంతో నిందితుడు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని పొడవడం మొదలు పెట్టాడు. వెంటవెంటనే కత్తిపొట్ల పడడంతో ఆ వ్యక్తి అపస్మానిక స్థితిలో వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఇరుకైన సందులో అతని ఈడ్చుకుంటూ వెళ్ళటం సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ తర్వాత కూడా కసి తీరా కత్తితో పొడుస్తూనే ఉన్నాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే నిందితున్ని పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులు.. ఎందుకు హత్య చేసావని అడిగితే బిర్యాని తినడం కోసం హత్య చేసి 350 రూపాయలు దోచుకున్నట్లు చెప్పడంతో పోలీసులు సైతం విస్తూ పోయారు.