
భార్యలతో మాటలు కాస్త గొడవగా మారాయి. ఆవేశంతో గొడ్డలిని తీసుకుని భార్యలను బెదిరించేందుకు వెళ్లాడు. అతని చర్యకు భయపడని ఇద్దరు భార్యలు ఆత్మరక్షణ కోసం ఎదురు తిరిగారు. ఈ క్రమంలో వారు కనకయ్యను తీవ్రంగా కొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.కనకయ్య గటంలో ఒక భార్య తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటన గురించి తరచూ భార్యలతో వాగ్వాదం జరిగేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గ్రామస్థులు ఈ ఘటనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కనకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఇద్దరు భార్యలను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ హత్య వెనుక పూర్తి కారణాలను రాబట్టేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజక వర్గాల్లో నెల కొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరు కు వాట్సాప్ ద్వారా తెలియ జేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు