ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అలాగే వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. డబ్బులు తీసుకుని ఓటు వేసే జనాలు గొప్ప గొప్ప నాయకులను ఎక్స్‌పెక్ట్‌ చేయకూడదని ఆయన అన్నారట. తమ ఓటును డబ్బు తీసుకుని అమ్ముకొనే ప్రజలు నీతివంతంగా లేనప్పుడు అలా ఎన్నికైన నాయకులు మాత్రం నీతివంతంగా ఉండాలని ఎందుకు అనుకుంటారు అని ఆయన అడుగుతున్నారు.


ఓటర్లు డబ్బు తీసుకుని ఓటు వేస్తే తాము ఎన్నుకున్నటువంటి నాయకుడు దొంగ కాకపోతే  హరిశ్చంద్రుడు అవుతాడా అని ఆయన అడుగుతున్నాడట. యధా ప్రజా తథా రాజా అంటూ ఆయన కామెంట్ చేసుకుంటూ వచ్చారు.  అయితే ఇన్ని మాటలు చెప్పే ప్రశాంత్ కిషోర్ కూడా గత ఎలక్షన్లలో డబ్బులు పంపకం విషయంలో ప్రధాన పాత్ర పోషించారని అంటారు. ఓటర్లకు డబ్బులు ఎలా పెంచాలనే విషయంలో ఈయన ఎక్స్‌పర్ట్‌.


చంద్రబాబు  ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక సిస్టమైజేషన్ ప్రకారం ఈయన ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాడని అంటున్నారు. గతంలో అంటే 2014లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో రఫ్ గా ఒక లెక్క వేశారట. అయితే ఆ లెక్క వేసిన దాంట్లో కూడా ఈ ఎమ్మెల్యేలు పదోవంతు, పావు వంతు ఇచ్చేసరికి పంచడానికి డబ్బులు సరి పడలేదని తెలుస్తుంది. దాంతో అప్పుడు జరిగిన  ఎలక్షన్లలో జగన్ ఓటమి పాలయ్యాడని అంటారు.


కానీ 2019 కి వచ్చేసరికి ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత ఇస్తామనుకున్నారో అంతా ముందుగానే కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలా ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా చేసిన ఈ వర్క్ వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి భారీ విజయం సాధించారని అంటారు. అలాంటి పీకే ఒక పక్కన ఎన్నికల సంస్కరణలు కోరుకుంటూ ఉంటారు. మరో పక్కన ఇటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ పీకే అన్నట్లుగా ఓటర్ అవినీతిపరుడైతే ప్రభుత్వం కూడా అవినీతి మయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: