45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని తమ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ఎల్లో మీడియాలో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ అవినీతి జరగలేదు అని వార్తలు వెలువరిస్తున్నాయి.   జగన్ అనుకూల మీడియాలో మాత్రం అవినీతి జరిగింది అని ఆధారాలు ఉన్నాయని కథనాలను ప్రచురిస్తోంది.  


ఏ మాత్రం  ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై సీఐడీ  కేసు నమోదు చేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఈయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాది.. ఆయనా వాదించారు. దీనిపై క్వాష్ పిటిషన్ వేసి వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు క్వాష్పిటిషన్ ను కొట్టివేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.


అందులో ముఖ్యంగా భజన్లాల్ కేసు మొదలు ఇన్ ఫ్రా కేసు వరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే సీఆర్పీసీ సెక్షన్ 482 ప్రకారం ఈ దశలో మేం జోక్యం చేసుకోలేము అని హైకోర్టు పేర్కొంది.  ఈ కేసు విషయంలో మినీ ట్రైల్ నిర్వహించలేం. ఈ కేసు 2021 డిసెంబరు 9న నమోదైంది. దర్యాప్తు సంస్థ 140 మందికి పైగా సాక్షులను విచారించి.. 4 వేలకు పైబడి దస్త్రాలను సేకరించిందని గుర్తు చేసింది.  నిధుల దుర్వినయోగం అస్పష్టమైనదని, దాన్ని తేల్చేందుకు అత్యంత నిపుణులతో కూడిన దర్యాప్తు అవసరం అని పేర్కొంది.


దర్యాప్తు తుది దశలో ఉన్న ఈ  సమయంలో ఎఫ్ఐఆర్లోనూ, జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం క్వాష్ పిటిషన్‌ కొట్టివేసింది. అంటే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు హైకోర్టు అంగీకరించింది. సీఐడీ పెద్ద ఎత్తున విచారించింది అన్నట్లు విశ్వసించింది. ఇందులో నిందితులకు ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పింది. ఈ కేసులో ఆధారాలు లేవని వాదనాలను తోసిపుచ్చింది. క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు హైకోర్టు వ్యాఖ్యలు ఈ కేసులో కీలకమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: