వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోడీ  తిరిగి తాను గెలుపొందడానికి ప్రజలను ఎలా ఆకట్టుకోవాలా అనే ప్రయత్నంలో  బిజీగా ఉన్నారు. దీనిలో భాగంగానే రైతు రుణమాఫీ, రైతు వడ్డీ మాఫీ అంటూ  చేసుకువచ్చారు ఆయన. ఇప్పుడు మధ్య తరగతి వర్గాన్ని కూడా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మధ్యతరగతి వాళ్ళకి  సొంత ఇల్లు అనేది ఒక కల.


దాని కోసం చాలామంది రూపాయి రూపాయి కూడగట్టుకుని  భవిష్యత్తులో తమకు కాకపోయినా తమ వారసులు ఉండడానికైనా ఇల్లు ఉండాలని కష్టపడుతుంటారు. అదే కలగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ కొంత ఆసరా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.  మధ్యతరగతి వాళ్ళు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి హౌసింగ్ లోన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.


అయితే లోన్ తీసుకున్న వాళ్లు దానికి వడ్డీ కూడా కట్టవలసి ఉంటుంది. అయితే ఈ హౌసింగ్ లోన్ తీసుకునే జనాలు , మధ్య తరగతి వాళ్ళు  ఆల్రెడీ కట్టినటువంటి వడ్డీని  మాఫీ చేయడానికి సంకల్పించుకున్నారు మన ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన  తన నిర్ణయాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఇంటిపై లోన్లు తీసుకున్న వాళ్లు కట్టిన వడ్డీని తిరిగి వాళ్లకే చెల్లించే విధంగా ప్లాన్ చేస్తుందట కేంద్ర ప్రభుత్వం.


సాధారణంగా అయితే డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలు పావలా వడ్డీకి రుణాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ వడ్డీని తిరిగి చెల్లిస్తారు. ఇలా వాళ్లు కట్టిన వడ్డీని తర్వాత తిరిగి వాళ్లకే  చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదేవిధంగా ఇప్పుడు హోమ్ లోన్ కు సంబంధించిన వడ్డీలను కూడా మాఫీ చేయబోతున్నారట. పట్టణ ప్రాంతాల్లో చిన్న మొత్తాల గృహ రుణాలకు వడ్డీ సబ్సిడీని అందించే నిమిత్తం 60,000 కోట్లు ఖర్చు పెట్టాలని చూస్తుందట కేంద్రం. ఈ పథకం మీద తొమ్మిది లక్షల లోన్ వరకూ వార్షిక వడ్డీ సబ్సిడీని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: