సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటేనే హైదరాబాద్, బెంగళూరు, పుణే లాంటి పెద్ద పెద్ద పట్ణణాలతో పాటు విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లా కేంద్రాల్లో కూడా ఐటీ టవర్ల నిర్మాణాలు జరిగాయి. దీనివల్ల స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి కూడా.


అయితే తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది. ఐటీ రంగం కుదేలవుతుంది అని ప్రచారం చేశారు. వీటితో పాటు మత కలహాలు, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుంది. మావోయిస్టులు పెరిగిపోతారు. అంధకారంలో తెలంగాణ ఉంటుంది అనే రకరకాల ప్రచారాలతో భయపెట్టారు. అందులో ఐటీ రంగం కూడా ఒకటి. ఈ తొమ్మిదనరేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఏమీ దెబ్బతినలేదు. మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ  కేటీఆర్ కూడా పారిశ్రామికవేత్తలను కోరిన విషయం మన అందరికీ తెలిసిందే.

మంత్రి కేటీఆర్ దీనిపై స్పందిస్తూ ఇది నా ఒక్కడి కృషి వల్లే జరగలేదు. ఇది నా ఒక్కడి క్రెడిట్ కాదు. గత ప్రభుత్వాలు టీడీపీ కావొచ్చు, కాంగ్రెస్ కావొచ్చు. వాళ్లు కృషి చేశారు. మేం దానిని మరింత వేగంగా అభివృద్ధి చేసి.. మెరుగులు దిద్దాం అని వ్యాఖ్యానించారు.

బెంగళూరు కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువ ఎంప్లాయిమెంట్ జనరేట్ అవుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే ఆయా ప్రాంతాల పరిస్థితులపై ఉద్యోగాలు ఆధారపడి ఉంటాయి. ఒకటి మాత్రం కచ్ఛితంగా ఒప్పుకోవచ్చు.  ప్రత్యేక హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధి చెందడానికి మంత్రి కేటీఆరే కారణం అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈయన చేసిన కృషి సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధికి దోహదపడింది. అంతకుముందు ప్రభుత్వాల పనితీరుతోనే ఇది సాధ్యమైందని కేటీఆర్ కూడా తెలిపారు. ఇది సమష్టి కృషి.


మరింత సమాచారం తెలుసుకోండి: