బంగాళదుంపకి ...ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం ఎన్నుకున్నామని.. ఈ సీఎం మనకు అవసరమా అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగు నీటి కాలవ, మురుగు కాల్వ కి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారని..పంటలు నష్టపోతే బీమా నగదు ఇవ్వాలని.. కానీ 16 మంది రైతులకు మాత్రమే భీమా కట్టారని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ తుఫాన్ కు ముందు చేరుకుని బసులోనే ఉన్నానని.. అక్కడ సమస్యలు పరిష్కరించి వచ్చా
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావం చూపిందని రెండు రోజులు తాను ఆగానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

 
తాను బాపట్లకు కార్యక్రమం ప్రకటించాక ఈ సీఎం నాటకంగా బయలుదేరారని.. రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం పూర్తిగా వదిలేసిందని.. పర్చూరులో వైకాపా కార్యకర్త పంట నష్టానికి రూ. 2 లక్షలు ఇచ్చానని.. మంచికి...చెడుకు కులం, మతం లేదని చంద్రబాబు అన్నారు. ఇప్పటికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ముఖ్యమంత్రి కి బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు. బాపట్లలో సీఎం కి ఒక వేదిక వేసి...మ్యాట్లు వేసి పొలం చూసేందుకు వచ్చారని.. పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుందని విమర్శించారు.


ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారన్న చంద్రబాబు.. రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదన్నారు. పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడని.. నాలుగు రోజులైనా ఏ పంటలు..ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదని.. ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదని.. రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారని చంద్రబాబు అన్నారు.


పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేదని.. తాను రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చానని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదామన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్నానన్నారు. పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తానని చంద్రబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: