నేతలను మేపలేక జాకీ పరార్‌..అంటూ ఈనాడులో నిన్న పతాక శీర్షికతో ఓ కథనం వచ్చింది. అంతర్జాతీయంగా పేరున్న దుస్తుల కంపెనీ జాకీ.. అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేతలను మేపలేక.. రాష్ట్రం నుంచి పరారైందన్నది ఆ కథనం సారాంశం. అధికార పార్టీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆ కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోయిందని.. ఆ సంస్థకు తెలంగాణ రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించిందని.. అక్కడ ఇప్పుడు ఆ సంస్థ రెండు యూనిట్లు పెడుతోందని ఈనాడు రాసింది.


అయితే.. ఈనాడు కథనంపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పాడిందే పాటరా.. అన్నట్టు పాత వార్తలను ఈనాడు వండివారుస్తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జాకీ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోడానికి కారణం టీడీపీ హయాంలో ఉన్న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీతలేనని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు.  టీడీపీ ప్రభుత్వానికి కమీషన్ల బేరం కుదరకే జాకీ ఫ్యాక్టరీ తరలిపోయింది అన్నది  వాస్తవమని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు.


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికీ జాకీ సంస్థను ఏపీలో ఉత్పత్తి ప్రారంభించమని కోరుతూనే ఉందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు.  జాకీ పరిశ్రమకు అవసరమైన  భూములను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా వాళ్లే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్న నారా లోకేష్‌.. అవన్నీ ఎక్కడకు వెళ్లాయో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.


అసలు ఆ సంస్థలు పెట్టారా.. లేదా.. పెడితే..ఎక్కడకు వెళ్లాయన్న విషయాన్ని.. లేదంటే వాటన్నిటీ లోకేష్‌ తినేశాడా అనే అనుమానం ఉందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అంటున్నారు. ఆ సంస్థలు రానందుకు లోకేష్, చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్న ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. ఇలాంటి మోసపు మాటలు చెప్పినందుకే ప్రజలు 2019 ఎన్నికల్లో తగిన శాస్తి చేశారన్నారు.  జాకీ పేరుతో పేజ్‌ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం 2017లో భూములు కేటాయించి 2018లో సేల్‌ డీడ్‌ ఇచ్చిందని... మరి ఆ సంస్థ ఎందుకు రాలేదో వారే చెప్పాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: