కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన అసహనంతో సజ్జల ఇంకా జగన్ ని ఉద్దేశించి మీ సొంత ఫోన్లు ట్యాపింగ్ చేస్తే మీరు ఊరుకుంటారా అని అన్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఈ విషయాన్ని తన ఆత్మ  గౌరవానికి సంబంధించిన విషయంగా తీసుకునేసరికి ఈ విషయం కాస్తా చిలికి చిలికి గాలి వాన అయ్యే పరిస్థితి రావడంతో ఆ తర్వాత  ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన కార్యాలయంలో దీనిపై సమీక్షలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది.


ఇందులో సీతారామాంజనేయులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. కానీ అధికారికంగా ప్రభుత్వం తరపు నుండి గాని, ఇంటిలిజెన్స్ సంస్థల తరపునుండి గాని ఏ సమాచారం బయటకి తెలియలేదు. బాలినేని చెప్పేది ఏమిటంటే అతని ఫ్రెండ్ గురించి వెతుకుతున్నాం, అతను భయపడి దాక్కున్నట్టున్నాడు, అతనిని కూడా తీసుకొస్తాం, అది ట్యాపింగ్ కాదు రికార్డే అని నిరూపిస్తామని అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. రికార్డింగ్ చేయడానికి వీలు లేదంటే వేరే ఫోన్ నుండి అయినా రికార్డింగ్ చేయొచ్చు అని విషయం కూడా ఆయన చెప్తున్నారు.


కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభావంతో ఈ విషయం మీద సమీక్షించడానికి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదిలి వచ్చిన పరిస్థితి నెలకొంది. కోటంరెడ్డి ఇంపాక్ట్ అంత రేంజ్ లో ఉంది మరి. ఈ విషయంలో తెలుగుదేశం కానీ, లేదా జనసేన గాని వ్యూహాత్మక నిశ్శబ్దంతో వెళ్తున్నారు. ఇది ఒక పకడ్బందీ వ్యూహం లాగా అయితే కనిపిస్తుంది అని చాలామంది మాట. లేదంటే ఇలాంటి సంచలన విషయాలు బయటకు వస్తే ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ అయితే ఆడేసుకోవడానికి చూస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.


కానీ వాళ్లు ఆశ్చర్యకరంగా ఈ విషయంలో నిశ్శబ్దం పాటించేసరికి కోటంరెడ్డిని ముందు పెట్టుకుని ఆయనతో కథ నడిపిస్తున్నారు అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ కోటంరెడ్డి విషయమైతే రాబోయే ఎలక్షన్ల ఫలితాలను శాసిస్తుందని అయితే స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: