ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాలలో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం 13,995 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో కొన్ని శాఖలు మినహా వాటిని భర్తీ చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వం భావిస్తోంది .సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైన దృష్టిసాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు నిర్ణయాలు కూడా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.


రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టు లలో అత్యధికంగా పశువర్ధన శాఖలో 4,765 పోస్టులు కలవు ఆ తర్వాత విద్యుత్ శాఖలో గ్రేడ్ -2 లో 1,127 పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. హార్టికల్చర్ విభాగంలో 1496 అసిస్టెంట్ పోస్టులు కలవు. అలాగే గ్రామ సర్వేయర్ 1027 పోస్టులతో పాటు మహిళా పోలీస్ 1092 ఖాళీగా ఉన్నాయి మొత్తం ఖాళీ లలో అత్యధికంగా పోస్టులు ఏవి ఉన్నాయి వేటిని త్వరగా భర్తీ చేయాలి అనేది ప్రభుత్వం ఒక అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోంది మహిళా పోలీస్ గ్రామ సర్వేయర్ మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాలు కార్యదర్శులు వార్డు పాలన వార్డు సంక్షేమ సంబంధించిన పోస్టులు భర్తీ చేయరాదని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇలాంటి ఖాళీల దాదాపుగా 4000 వరకు ఉన్నట్లు సమాచారం మరికొన్ని పోస్టులను స్థానిక భౌగోళిక అంశాలను పరిగణంలోకి తీసుకున్న తర్వాతనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. దాదాపుగా ఎనిమిది శాఖలలో గ్రామ వార్డు సచివాలయాల పోస్టులకు ఇప్పటి వరకు జాబ్ చార్జ్ ఖరారు కాలేదని తెలుస్తోంది. వీటన్నిటికీ ఒక కమిటీ నివేదిక వస్తేనే జాబ్ చార్జ్ ఖరారు చేస్తారని లేకపోతే చేయలేదన్నట్లుగా తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఎలాంటి పోస్టులు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: