సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఆ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారా..? దీంతో వైసీపీలోకి ఇతర పార్టీల నేతలు క్యూ కట్టబోతున్నారా..? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుంది. కాకపోతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గెలిచిన ఎమ్మెల్యేలకు కాదట, ఆ పార్టీల్లో ఉండే సీనియర్ నాయకులకట. దీంతో ప్రతిపక్ష పార్టీలలోని సీనియర్ నాయకులు వైసీపీలోకి క్యూ కట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది.

 

ఈ క్రమంలో.. ఎప్పటి నుంచో పార్టీలో చేరేందుకు చూస్తున్న సీనియ‌ర్లకు మొదటి అవ‌కాశం ఇవ్వాల‌ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వ‌ర్గాల్లో చర్చ జరుగుతుంది. మాజీ కేంద్ర మంత్రులు.. ప‌న‌బాక ల‌క్ష్మి, కోట్ల సూర్యప్ర‌కాశ్ రెడ్డి, కావూరి సాంబ‌శివ‌రావులు వైసీపీలోకి చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మాజీ కేంద్ర మంత్రి సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా సైకిల్ దిగిపోయేందుకు రెడీ అయ్యారు. టీడీపీని వీడ‌న‌ని రెండు మూడు నెల‌ల కింద‌ట కూడా చెప్పిన ఆయ‌న అనూహ్యంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌నకు నామినేటెడ్ ప‌ద‌వి కానీ, టీటీడీలో స‌భ్యత్వం కానీ ఇచ్చేందుకు ఓకే అన్నార‌నే ప్రచారం సాగుతోంది.

 

అలాగే కావూరి సాంబ‌శివ‌రావు విషయానికొస్తే.. మొదట్లో బీజేపీకి జైకొట్టినా.. త‌ర్వాత ఆయ‌న ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయితే, అప్పట్లో ఆయ‌న ఆరోగ్య కార‌ణాల రీత్యా మౌనంగా ఉన్నారు. కానీ, గ‌డిచిన నెల రోజులుగా సీఎం జగన్ తో ఆయ‌న జరుపుతున్న మంత‌నాలు కొలిక్కి వ‌చ్చాయ‌ని, దీంతో ఆయ‌నే స్వయంగా వ‌చ్చి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక పోతే ప‌న‌బాక ల‌క్ష్మి.. ఎలాంటి ష‌ర‌తులు లేకుండానే జ‌గ‌న్ చెంత‌న చేరేందుకు ఆమె ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే రాబోయే వారం పదిరోజుల్లోనే వీరి చేరిక ఉంటుంద‌ని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే పార్టీలోకి ఎవరొచ్చినా తీసుకుంటామ‌ని సీఎం జ‌గ‌న్ ఇప్పటికే ప్రక‌టించటంతో ఇంకెంత మంది నేతలు వైసీపీలోకి క్యూ కడతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: