నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాన మంత్రి అవుతారా.. అంటే.. ఏమో ఇప్పుడే చెప్పలేం అంటారు చాలా మంది. కానీ.. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న రాజకీయం చూస్తుంటే మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రధానిగా మోడీ మరోసారి కాకూడదంటే.. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదు.. అది జరగాలంటే.. బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్‌డీఏ కూటమి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవాలి. అది జరగాలంటే.. ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలి.


కానీ.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ బలపడుతున్న సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదు. ఆ పార్టీ అంతర్గత పోరు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఇక ప్రధాని పదవి బరిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుమారుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల బరువు మోసేందుకు సిద్ధంగా లేడు.. ఇలాంటి కారణాల వల్ల మళ్లీ మోడీయే మరోసారి ప్రధాని అవుతారేమో అనిపించక తప్పదు. మోడీ మళ్లీ ప్రధాని కాకూడదటంటే.. మరో రెండేళ్లలో మోడీ వ్యతిరేకత బాగా పెరగాలి. అది ఎంత పెరిగినా విపక్షాల ఐక్యత కూడా సాధ్యమవ్వాలి. కానీ ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు.


తాజాగామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన తీరు చూస్తే.. టీఎంసీ వంటి పార్టీలు కాంగ్రెస్‌ తో మళ్లీ కలిసి పని చేస్తాయన్న ఆశాభావం ఏమాత్రం కనిపించడం లేదు. అటు శరద్ పవార్ మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష  పార్టీలన్నీ
ఏకం కావాలని  అంటున్నారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు కోసం పార్టీలతో చర్చలు జరుపుతున్న మమత శివసేన, ఎన్సీపీతో మంతనాలు జరిపారు. ఇప్పటికే శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌లతో మమత సమావేశమయ్యారు. మమత మాత్రం కాంగ్రెస్ కూటమి వైపు అంతగా మొగ్గు చూపడంలేదు. మరి కాంగ్రెస్‌ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం అవుతుందా.. అయినా అది ప్రధాని మోడీని ఆ పీఠం నుంచి కదిలించే స్థాయిలో సీట్లు గెలుస్తుందా అన్నది అనుమానాస్పదమే.


మరింత సమాచారం తెలుసుకోండి: