ఉక్రెయిన్, రష్యా యుద్దం అణు బాంబు యుద్ధంగా మారబోతుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఏడాదైనా యుద్ధం ఆగడం లేదు. దీంతో రష్యా రోజు రోజుకు విసుగెత్తిపోతుంది. రెండో ప్రపంచ యుద్ధం కూడా అణు బాంబు యుద్ధంతోనే ఆగింది. పెరల్ హార్బర్ పై జపాన్ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పై అమెరికా అణు బాంబులు ప్రయోగించింది. దీనిలో యుద్దం ఆగిపోయింది.


ఇలాంటి ప్రయోగం రష్యా చేయనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జెపోజెజరియా, లూహన్ స్కీ, డొనెట్ స్కీ, లాంటి రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఇంకా ప్రతిఘటన ఎదురవుతుంది. దీంతో రష్యా అణు బాంబు దాడి చేసే అవకాశముందని అమెరికా హెచ్చరించింది. అమెరికా నిఘా వర్గాల నివేదిక ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది.


రష్యా అణు దాడికి సిద్ధమవుతున్నట్లు అగ్రరాజ్యం ఆరోపిస్తోంది. ఒకవేళ అణు యుద్ధం గనక వస్తే ప్రపంచ వినాశానానికి దారి తీస్తుంది. ఉక్రెయిన్ తో పాటు దాని చుట్టు పక్కల ఉండే ప్రాంతాలు సర్వనాశనం అయిపోతాయి. రష్యా దగ్గర అందరి కంటే ఎక్కువగా అణ్వయుధాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీసుకుబోయే కఠిన నిర్ణయాలకు ఉక్రెయిన్ తో పాటు యూరప్ దేశాలు, అమెరికా, ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సిందే.


మరి రష్యాను ఆపేదెవరూ.. అణు దాడి చేయకుండా ముందుగానే పుతిన్ తో చర్చలు జరిపే అవకాశం ఉందా? చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఎందుకు రావడం లేదు. యుద్ధంలో ఓడిపోయి కనీసం అణు దాడి జరగకుండా చూస్తే ఉక్రెయిన్ తో పాటు అమెరికాలో ఉన్న ప్రపంచ దేశాల్లో ఉన్న వారందికీ మేలు చేసిన వారవుతారు. లేదు ఇంకా యుద్ధం కొనసాగిస్తామంటే రష్యా అణు దాడితో ఉక్రెయిన్ బూడిద కాక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: