చంద్రబాబు అరెస్టును పవన్ కల్యాణ్ చక్కగా వాడుకున్నట్లే తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి పరామర్శించడం తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో జగన్ సర్కారును కూలుస్తామని చెబుతున్నారు. ఇలా చెప్పడం వెనక పవన్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. పవన్ ను పూర్తిగా నమ్మేందుకు వెనకాడుతున్నారు.


పవన్ ఒక అడుగు ముందుకేసీ టీడీపీ కార్యకర్తలను జనసేన సైనికులు ఏమీ అనవద్దని కోరారు. వారు ఏమైనా అన్నా కూడా ఒక్క మాట వారిని అనవద్దని కోరారు. తిట్టినా పడండని చెప్పారు. ఇంతలా దిగజారి మాట్లాడటం వెనక బలమైన కారణం ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారాన్ని షేర్ చేసుకోవాలని పవన్ అనుకుంటున్నారు.


దీని గురించి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ మాట్లాడినట్లు లోకేశ్ గానీ, చంద్రబాబు గానీ మాట్లాడటం లేదు. లోకేశ్ కేవలం పవన్ మద్దతు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడటం లేదు. పవర్ షేరింగ్ అనేది జనసేన నాయకులు కూడా కోరుకుంటున్నారు. కానీ తెలుగు దేశం పార్టీ నాయకులు మాత్రం అస్సలు కోరుకోవడం లేదు.


ఎక్కడా కూడా పవన్ తో పొత్తు గురించి గానీ, అధికారం షేర్ చేసుకుంటామని చెప్పడం లేదు. పవన్ మాటల్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల టీడీపీ తాము ఎప్పుడూ కూడా పవన్ కు మాట ఇవ్వలేమని చెప్పొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కల్యాణ్ అనుకుంటున్న పవర్ షేరింగ్ టీడీపీ అనుకోవడం లేదు. కానీ పవన్ మాత్రం ఈ సారి తప్పకుండా కచ్చితంగా చేయాలని అసెంబ్లీలో అడుగుపెట్టాలని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ ఎలా ముందుకు వెళతాయనేది అందరిలో వెళుతున్న ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: