పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత  ఎంతో దిగ్బ్రాంతి చెందారు.  అంతే కాకుండా జనసేన పార్టీ ఇకపై తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ సందర్భంలో. దాంతో తెలుగుదేశానికి అనుకూల మీడియా, పత్రికా సంస్థలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ గా వ్రాసుకొస్తున్నాయని తెలుస్తుంది.


అది కూడా వాళ్ళు రాజకీయం పరంగా పాజిటివ్ వ్యాఖ్యలు చేస్తారు తప్పించి పర్సనల్ గా మాత్రం చెయ్యరని తెలుస్తుంది. అయితే వీళ్ళ విషయాన్ని పక్కన పెడితే జాతీయ పత్రిక అయినటువంటి డెక్కన్ క్రానికల్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తులు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకి 20కోట్ల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఈ మధ్యన ప్రసంగిస్తూ తన వద్ద డబ్బు లేదని అన్నారట.


అంతేకాకుండా ఆయన ఈ మధ్య తిరుపతి, కాకినాడలో జరిగిన బహిరంగ  సమావేశాల్లో తన దగ్గర అసలు డబ్బు లేదని అన్నారట. అయితే అత్యధిక పారితోషికం  తీసుకునే  వ్యక్తి దగ్గర డబ్బు లేకపోవడం ఏంటని విమర్శకులు తమ నోటికి పని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు ఉండే 12మంది పర్సనల్ స్టాప్ తో పాటుగా, పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ లో ఉండే 20మంది స్టాఫ్ ను ఎంతో అభిమానం గా చూసుకుంటారని, వాళ్లకు జీతాలు ఇవ్వడానికి ఆయన విపరీతంగా ఖర్చు పెడుతుంటారని ఆ పత్రిక తెలియజేసింది.


తిరుపతి, కాకినాడ సభలకు కూడా ఎవరిని ఆ ఖర్చు గురించి అడగకుండా అంతా తానే భరించాడని అంటారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడి నుండి కాపాడడానికి పవన్ కళ్యాణ్ చుట్టూ ఎప్పుడూ 12 మంది పర్సనల్ స్టాప్ ఉంటారని వాళ్ల జీతాల ఖర్చు కూడా ఎక్కువే అని ఆ పత్రిక చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: