
వైసీపీ ఎంత రెచ్చగొట్టినా గానీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతోనే కలిసి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనిపై టీడీపీ నాయకులు మాట్లాడటం లేదు గానీ పవన్ మాత్రం కచ్చితంగా తాము టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటామని మీడియా సాక్షిగా ప్రకటించారు. ఇప్పుడు వైసీపీ నాయకుల అస్త్రం బీజేపీతో టీడీపీ కలవకుండా చూడడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత చంద్రబాబు నాయుడును బయటకు తీసుకువచ్చేందుకు పవన్ బీజేపీతో ప్రయత్నాలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
అయితే బీజేపీ టీడీపీతో కలిసేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. కానీ పవన్ కు మాత్రం బీజేపీ టీడీపీతో కలిస్తేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ రెండు కలిస్తే రాష్ట్రంలో , కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు.. బీజేపీ, టీడీపీ రెండు పార్టీలను కలిపేందుకు పవన్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
కానీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరీని నియమించడంతో ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు ఎన్టీఆర్ కూతురుగా ఆమెకు మద్దతిస్తారని ఆశించి బీజేపీ ఎత్తులు వేసింది. మరి దీనిపై పవన్ కల్యాణ్ బీజేపీని కలపాలని ప్రయత్నించడం అధిష్టానం దీని పై అయిష్టంగా ఉండడంతో వైసీపీ దీన్ని అస్త్రంగా మలుచుకుంటోంది. అయితే పవన్ అనుకున్నది జరిగితే వైసీపీకి ఈజీగా గెలవడం కష్టం. కాబట్టి పవన్ ను రెచ్చగొట్టి పొత్తు కుదరకుండా చేయడం వైసీపీ వ్యుహం.