జగన్ ను గద్దె దించాలనే విపక్షాలు పని చేస్తున్నాయి. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను తొలగించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. 2018 తర్వాత నియమితులైన విద్యుత్ శాఖలోని ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7 లోకి తీసుకురావాలని నిర్ణయించారు. జగన్ హయాంలో వచ్చిన వాళ్లు లేదా చంద్రబాబు పాలనలో చివరలో వచ్చిన వాళ్లు ఉంటారు.
అయితే జీవో నెంబర్ 7 కిందకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావడం వల్ల వారి జీతాల్లో కోత పడే అవకాాశం ఉంది. దాదాపు వారి జీతాల్లో నెలకు రూ. 6 వేల నుంచి రూ. 12 వేల వరకు కోత పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన జీతం కంటే కూడా ఇప్పుడు వచ్చిన వారికి కోతకు గురయ్యే అవకాశం ఉంది. దీని గురించి ప్రభుత్వ పెద్దలకు తెలుసో తెలియదు అని చాలా మంది భావిస్తున్నారు.
అయితే ఒక సారి ఉద్యోగం లో చేరిన తర్వాత ఎవరైనా సరే జీతం పెరగాలని భావిస్తారు. కానీ తగ్గుతుందని ఆశించరు. అసలే నిత్యావసర వస్తువులు పూర్తిగా పెరిగిన ఈ సమయంలో జీతాలు తగ్గిస్తే ఎలా జీవించగలరు. అసలు ఉద్యోగం వచ్చిందని సంతోషించాలో లేక జీతంలో కోత విధించే జీవో తెస్తున్నందుకు బాధపడాలో వారికి తెలియడం లేదు. ఈ జీవో పై పు:నపరిశీలించాని విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి