
దీన్ని ప్రపంచంలోని చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. చిన్న పిల్లలను కూడా చూడకుండా నరమేధం చేసిన హమాస్ ఉగ్రవాదులను పురుగుల్లా నలిపేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. అయితే ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న బందీలను విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా గాజాలో భీకర దాడులు చేసిన ఇజ్రాయిల్ హమాస్ కు గట్టి సందేశం పంపింది.
హమాస్ ను ఈ భూమిపై లేకుండా తుద ముట్టిస్తామని ఇజ్రాయిల్ ప్రధాని ప్రకటించారు. అయితే నవంబర్ 26, 2011 దాడుల్లో ముంబయి వణికిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడుల సమయంలో కూడా ఇజ్రాయిల్ భారత్ కు అండగా ఉంటామని ప్రకటించింది. ప్రస్తుతం నవంబర్ 26న భారత్ కు సందేశం పంపింది. మీరు 12 ఏళ్ల క్రితమే ఇలాంటి దాడులు చూశారు. మేం ఇప్పుడు చూశాం. ఏ దేశానికైనా ఉగ్రవాదుల ముప్పు ఉండటం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
భారత్ కు అన్ని రకాల అండగా ఉంటామని ప్రకటించింది. ముఖ్యంగా టెర్రరిస్టులను ఏరి వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. ముంబయి దాడుల తర్వాత భారత్ స్పందించిన తీరు, అజ్మల్ కసబ్ ను పట్టుకుని ఉరి కంభం ఎక్కించడం తదితర పరిణామాలు శర వేగంగా జరిగిపోయాయి. అయినా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల నుంచి కశ్మీర్ లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో కచ్చితంగా ఉగ్ర మూలాలను కూకటి వేళ్లలో పెకిలించేయాలి.