ఇంటర్ పరీక్షల సమయం దగ్గరకు వస్తోంది. ఈ సమయం విద్యార్థులకు అత్యంత కీలకం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. పరీక్షల వరకూ చదివింది ఒక ఎత్తైతే.. ఆ పరీక్షలు రాయడం ఇంకో ఎత్తు.

 

 

అందుకే పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు జగన్ సర్కారు ఓ యాప్ తీసుకొస్తోంది. ఈ యాప్ ద్వారా విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

 

 

హల్ టికెట్లపై క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 8 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయని వెల్లడించారు.

 

 

ఈసారి నుంచి ఇంటర్‌లో గ్రేడింగ్‌తో పాటు మార్కులు కూడా ఇస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఘటనపై కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా టెన్త్, ఇంటర్ విద్యార్థులకు సగం టెన్షన్ తగ్గుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: