మ‌న‌కు నిత్యం వండుకుని తినేందుకు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయల్లో ముల్లంగి కూడా ఒక‌టి. ఇది ఘాటైన వాస‌న‌, రుచిని క‌లిగి ఉంటుంది. అందుక‌ని ముల్లంగిని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ నిజానికి ముల్లంగి వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముల్లంగి అనేది ఓ కూరగాయ మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముల్లంగిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దీని వాడకం ఎక్కువ. సాంబార్, చట్నీ ఇలా వివిధ రకాలుగా వండుకుని తింటారు. దీన్ని తిన‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవచ్చు. అలాగే క్యాన్స‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

ముల్లంగిని మనం మన డైట్ లో తీసుకోవడం వల్ల సూపర్ ప్రయోజనాలు ఉన్నాయని న్యూటీషనిస్టులు చెప్పడం జరిగింది. మీకు కనుక దగ్గు, జలుబు వచ్చి మీరు బాధ పడుతున్నారా దీని వల్ల మీరు రాత్రి పూట సరిగా నిద్ర పోలేక పోతున్నారా...? అయితే తప్పకుండా మీరు మీ డైట్ లో చేర్చుకోవాలసిందే. దీని వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. పైగా మీ చర్మం కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. ముల్లంగి లో ఏంటి హైపర్టెన్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది మీ బ్లడ్ ప్రెజర్ మీద కూడా మంచి బెనిఫిట్ ని ఇస్తుంది.

 అధిక రక్తపోటు తో బాధ పడే వారికి ఇది దివ్యౌషధం అనే చెప్పొచ్చు. ముల్లంగి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బి6 , పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో ఉంటాయి. దీనితో ఇది రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు

 ఈ కూరగాయ వల్ల చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభిస్తాయి. దీనితో ఇది చాలా రకాల సమస్యలు తరిమి కొడుతుంది. ముఖ్యంగా రక్తపోటు మరియు లివర్ కి ప్రయోజనాన్ని ఇస్తుంది. ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇదే మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: