మూత్రవిసర్జన చేస్తున్నపుడు మంట పుట్టటం స్త్రీలలో కనిపించే ఒక సర్వ సాధారణ సమస్య. మూత్రం ప్రయాణించే మార్గం ఇన్ఫెక్షన్ కి గురికావటం ఇందుకు కారణం. మూత్ర మార్గం ఇన్ఫెక్షన్కి గురికావడం రెండు రకాలుగా వుంటుంది. మొదటిది : మూత్ర మార్గపు పైభాగం ఇన్ఫెక్షన్ కి గురికావటం, కిడ్నీలు, కిడ్నీల నుంచి మూత్రశయానికి మూత్రాన్ని చేరవేసే మూత్రశయం ఇన్ఫెక్షన్ కి గురికావటం ఇందులోకి వస్తుంది. రెండవది : మూత్ర మార్గపు అడుగు బాగం ఇన్ఫెక్షన్ గురి కావటం. మూత్రశయం నుంచి మూత్ర ద్వారం దాకా వుండే మూత్ర విసర్జన నాళం ఇన్ఫెక్షన్ కి గురివావటం ఇందులోకి వస్తుంది. స్త్రీలలో ఈ రెండవది అయిన మూత విసర్జన నాళం ఇన్ఫెక్షన్ కి గురికావటమే ఎక్కువగా వుంటుంది. ఇందుకు కారణం స్త్రీలలో మూత్ర విసర్జన నాళం పొడవు మరీ తక్కువగా ఉండటం ! మూత్ర విసర్జన నాళం పొడవు తక్కువగా వుండటం వల్ల జననేంద్రేయం చుట్టుపక్కల నుంచీ, మల ద్వారం వద్దనుంచీ అనేకానేక సూక్ష్మక్రిములు అతి తేలికగా స్త్రీ తాలూకు మూత్ర విసర్జన నాళంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మూత్రశయం దాకా వ్యాపించి ఆయా బాగాన్ని మాటి మాటికి ఇన్ఫెక్షన్కి గురిచేస్తుంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: