ప్రస్తుత బిజీ లైఫ్ లో.. ఎవరూ కూడా తమ ఆరోగ్య విషయాలపై దృష్టి సారించడం లేదు. అలాగే అన్ని తొందర.. తొందరగా పనులు చేస్తూ...వండుకోవడానికి సమయం లేక బయట ఫుడ్ కు అలవాటై పోయారు. దీంతో చాలా మంది పలు రకాల వ్యాధుల భారీన పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత కూడా ఈ వ్యాధుల బారిన పడడం గమనార్హం. షుగర్, బీపీ మరియు అధిక బరువు ఇలాంటి వ్యాధులు ప్రస్తుతం కనబడుతున్నాయి.
అయితే బరువు పెరగడం  భార్య భర్తల లోనూ ఎక్కువగా కనిపిస్తుందని తాజా సర్వేలో తేలింది. భార్య భర్తలు  బరువు తగ్గడానికి నిపుణులు కొన్ని నియమాలు సూచించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కలిసి  డాన్స్ చేయటం :

 
ఎక్ససైజ్ లో డాన్స్ కు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే డాన్స్ చేయడం వల్ల మనిషిలో కొవ్వు పదార్థాలు తగ్గిపోతాయి. అలాగే డాన్స్ చేయడం అందరికీ ఇష్టంగా ఉంటుంది.

కలిసి  జాగింగ్ చేయటం:

భార్య భర్తలు ఇద్దరూ జాగింగ్ వెళ్లడం వల్ల.. మానసిక ఉల్లాసం వారికి లభించే ఉంది. దీంతో వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే జాగింగ్ చేయడం వల్ల మనిషిలో రక్తప్రసరణ చాలా అద్భుతంగా జరుగును.

సైకిలింగ్ :

భార్యాభర్తలు ఇద్దరూ కలిసి... కారు లో బయటకు పోవడం కంటే... భార్యతో కలిసి భర్త సైక్లింగ్ చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది అలాగే బరువు ఈ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు.

భార్య భర్తల మద్య ప్రేమ :

భార్య భర్తల మధ్య ప్రేమ ఎక్కువగా పెంచుకుంటే... వారి జీవితం సాఫీగా జరుగుతుంది అలాగే శరీరంలో ఎలాంటి కొవ్వు పెరగకుండా  కాపాడుతుంది.

యోగా చేయటం:

నిత్యం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి యోగా చేయడం వల్ల... మానసిక సంతృప్తి మరియు ప్రశాంతత దొరుకుతుంది. అలాగే రొమాంటిక్ గా యోగా చేసుకోవడం వల్ల.. బరువు సమస్య కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: