గచ్చకాయల గురించి ఈ తరం పిల్లలకు తెలియకపోవచ్చు..కానీ మనం చిన్న నాటి రోజుల్లో ఈ గచ్చకాయలతో భలేగా ఆడుకుంటున్న సందర్భాలు గుర్తుకు వస్తాయి. ఈ గచ్చకాయలు భారతదేశం అంతటా మనకు ప్రతి చోట దర్శనమిస్తాయి.. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉండే ఈ గచ్చకాయలు.. తీరప్రాంతాలు , బంజరు భూములు, అధికంగా చెట్లు ఉన్న అడవుల్లో.. చెట్లను అంటిపెట్టుకొని తీగల పైకి పాకుతూ ఉంటుంది ఈ గచ్చకాయ చెట్టు.. ఇక ఈ గచ్చకాయ చెట్టు కాయలు ముల్లుతో కూడి వుంటాయి..ఈ గచ్చకాయ గింజలతో అప్పుడు ఆడపిల్లలు గచ్చకాయ ఆట ఆడితే , ఇక మగ పిల్లలేమో గోలీలతో ఆటలు ఆడేవారు .


అంతేకాదు ఈ గచ్చకాయను రాతిపైన నూరి, చేతి పైన పెడితే సుర్రుమని మంట పుట్టించి, నవ్వుకున్న  బాల్యం రోజులు కూడా గుర్తుకొస్తాయి. అయితే వీటిని కేవలం ఆటవస్తువుగా మాత్రమే చూసి ఉంటారు.. కానీ వీటి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.. అయితే ఈ గచ్చ కాయ గింజలు ఉపయోగాలు ఏంటో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..


నిజానికి ఈ గచ్చకాయ గింజల లోపల పసుపు పచ్చని ఒక చిక్కటి ద్రవం ఉంటుంది.. ఈ ద్రవంలో అయోడిన్, సిసాల్పిన్, నాను గ్లూకోసైడల్, సాపోవిన్ వంటి పదార్థాలు ఉంటాయి. వీటి గింజలు రుచికి చేదుగా అనిపిస్తాయి.. ఇకపోతే గచ్చకాయ చెట్టు యొక్క కాయలు , ఆకులు , బెరడు ఇలా ఎన్నో రకాలుగా మనం ఆయుర్వేద వైద్యంలో వీటిని ఉపయోగిస్తున్నారు..ఇక గచ్చకాయ గింజలు ఆరోగ్య విషయానికి వస్తే.. శరీరంలో ఏర్పడే కఫ, వాత రోగాలను తగ్గించి, పిత్తాన్ని పెంచుతుంది.. అంతేకాదు జీర్ణశక్తిని బాగా పెంచి, శరీరంలో రక్తం పెరగడానికి కూడా ఉపయోగపడతాయి.


ఒక ముఖ్యంగా కళ్ళకు, చర్మ కాంతికి , మెదడుకు ఈ గచ్చకాయ గింజలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఇక అంతే కాదు ఈ గచ్చకాయల నుంచి తీసిన తైలం తో బట్టతల మీద రాస్తూ వుండడం వల్ల కచ్చితంగా జుట్టు వస్తుంది. చర్మ వ్యాధులు, అల్సర్ , డయాబెటిస్, దగ్గు, కడుపులో పురుగులు, నరాల వాపులు, పైల్స్ ఇలా ఎన్నో రకాల సమస్యలను దూరం చేసుకోవడానికి ఈ గచ్చకాయల ఉపయోగిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: