దేశంలో క‌రోనా కేసుల ముప్పు త‌గ్గిన‌ట్టు ఉంద‌ని అంద‌రూ మురిసిన సంద‌ర్భంలోనే క‌రోనా నూత‌న వేరియంట్ అయిన ఒమిక్రాన్ ద‌క్షిణాఫ్రికాలో వెలుగులోకి వ‌చ్చి ఇప్పుడు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డలాడిస్తుంది. దాని యావ‌త్ భార‌త్‌పై ప‌డింది. అక్క‌డ‌క్క‌డ రాత్రి పూట క‌ర్ప్యూ కూడా విధిస్తున్నారు. అయితే ఒమిక్రాన్‌తో పాటు క‌రోనా కేసులు కూడా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కేసులు ఇలాగే పెరిగితే క‌రోనా మూడ‌వ వేవ్ వ‌చ్చేన‌ట్టే అని ప‌లువురు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఫిబ్ర‌వ‌రి లేదా మార్చి నెల‌లో కేసులు మ‌రింత గ‌రిష్ట స్థాయికి చేరుకుంటాయి అని అంచెనా కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్ప‌టికీ ముగుస్తుంద‌నే అంశంపై ఐఐటీ కాన్పూర్ ప్రొఫెస‌ర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. క‌రోనా వైర‌స్ థ‌ర్డ్ వేవ్ ఏప్రిల్ నాటికి ముగుస్తుంద‌ని చెప్పుకొచ్చారు. ఒమిక్రాన్ కొవిడ్‌-19 ల‌క్ష‌ణాలు అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో ర్యాలీలు క‌రోనా కేసులు వేగంగా పెరిగేందుకు కార‌ణం కూడా కావొచ్చు అని హెచ్చ‌రిక జారీ చేసారు. అలాంటి స‌మావేశాల‌లో క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు అనుస‌రించ‌డం అంత సుల‌భం కాదు అని మండిప‌డ్డారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌కుండా అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఎన్నిక‌ల ర్యాలీల‌లో పాల్గొంటే.. కేసులు పెరిగే ప్ర‌మాద‌ముంద‌ని ప్రొఫెస‌ర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ పేర్కొన్నారు.

త‌న గ‌ణిత న‌మూనా ఆధారంగా క‌రోనా కేసుల గ‌రిష్ట స్థాయిని అంచెనా వేసిన ప్రొఫెస‌ర్ మ‌నీంద్ర అగ‌ర్వాల్ ముఖ్యంగా దేశంలో జ‌న‌వ‌రి నెల‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుంద‌ని చెప్పారు. అయితే మార్చిలో మాత్రం రోజుకు 1.8 ల‌క్ష‌ల కేసులు రావ‌చ్చు అని అంచెనా వేసారు. ఆఫ్రికా, భార‌త్‌లో జ‌నాభాలో 80 శౄతం మంది 45 ఏళ్ల‌లోపు వారు ఉన్నార‌ని అగ‌ర్వాల్ అభిప్రాయ ప‌డ్డారు రోగ నిరోధ‌క శ‌క్తి రెండు దేశాల‌లో 80 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అయితే ద‌క్షిణాఫ్రికా త‌ర‌హాలోనే భార‌త్‌లో కూడా పెద్ద‌గా ఒమిక్రాన్ ప్ర‌భావం ఏమి చూపే అవ‌కాశం లేద‌ని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కేసులు వ‌చ్చినా మ‌ర‌ణించేంత ప్ర‌మాదం ఏమి లేదు భార‌త్‌లో అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: