ఇక కరివేపాకులోని ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి మన భారతీయ ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కరివేపాకు చెట్టును కొంతమంది ఇంటి ఆవరణలో కూడా పెంచుతారు.ఇక దీని ఆకులతో కూరలకు ఇంకా సాంబార్ కు రుచి ఎంతో పెరుగుతుంది. దీని ఉపయోగాలు తెలిసినా కూడా కొంతమంది దానిని తినకుండా పక్కన పెడుతున్నారు. కానీ పచ్చి కరివేపాకులను తిన్నా కూడా ఉపయోగం ఉంటుంది.కరివేపాకులో మందు లక్షణాలు చాలానే ఉన్నాయి.కరివేపాకుతో పచ్చడి కూడా చేస్తారు. పొడి తకూడా యారు చేసుకొని తింటారు. కరివేపాకు హై. బీ.పీ ని ఖచ్చితంగా అదుపులో వుంచుతుంది.కరివేపుకుతో ఎలాంటి భయంకర జబ్బులకు చెక్ పెట్టొచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 50 గ్రాములు కరివేపాకు దంచి మజ్జిగలో పరగడుపున తాగితే జిగట విరేచనాలను ఇంకా రక్త విరేచనాలను తగ్గిస్తుంది . 50 గ్రాముల కర్వేపాకు మెత్తగా దంచి మజ్జిగలో కలిపి పరగడుపున తాగితే అల్సర్ ను కూడా బాగా తగ్గిస్తుంది.అలాగే లేత కరివేపాకు తేనెలో కలిపి తింటే మంచి విరేచనకారి అర్షమొల్లలకు మంచి మందుగా కూడా పనిచేస్తుంది.ఇక కరివేపాకు నీడలో ఆరబెట్టి పొడి చేసి ఉదయం 1 స్పూన్ ఇంకా సాయంకాలం ఒక టీస్పూన్ నీటిలో కలిపి తాగితే అర్షమొల్లలకు తగ్గుతాయి. అలాగే కరివేపాకు కాయకు నిమ్మరసం కలిపి దంచి, విషం తాగిన వారికి నీటిలో కలిపి తాగితే విషానికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది. ఒక పది పదిహేను కరివేపాకులు పరగడుపున నమిలి మింగితే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది.కరివేపాకుతో అజీర్ణం దూరం అవుతుంది.అదేవిధంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కరివేపాకుని దంచి గజ్జిపై పెడితే గజ్జి కూడా తగ్గుతుంది.అలాగే కొబ్బరి నూనెలో కరివేపాకు మరిగించి చల్లారిన తరువాత వడగట్టి రోజు తలకు రాస్తే జుట్టు కూడా నల్లగా మారుతుంది. అలాగే కరివేపాకు క్రమం తప్పకుండా ఆహారంలో ఎక్కువగా తింటే వెంట్రుకలు కూడా బాగా నిలబడతాయి. ఇక కరివేపాకు పొడి తింటే డిసెంట్రీ ఇంకా అలాగే డయేరియా తగ్గుతుంది. కరివేపాకు సర్వరోగ నివారిణిగా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: