సాధారణంగా చాలా మంది ఒకరు దుస్తులను మరొకరు ధరిస్తూ ఉంటారు. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముల్లు, దగ్గర బంధువులు, స్నేహితులు ఇలా చాలా మంది ఒకరి బట్టలు మరొకరు వేసుకుంటుంటారు. అంతే కాకుండా మరి కొందరు తమ బట్టలు పొట్టి అయిపోయాయి అనో లేక బోర్ కొట్టో ఇలా వివిధ కారణాల వలన ఇతరులకు ఇచ్చేస్తుంటారు. అవసరం ఉన్న వారు ఇందులో ఏముందిలే బట్టలు బాగున్నాయి కదా అని తీసుకుని వేసుకుంటుంటారు. అయితే ఇలా ఒకరు బట్టలు మరొకరు వేసుకోవడం మంచిది కాదట. ఇలా ఒకరి దుస్తులు మరొకరు వేసుకోవడం వలన కొన్ని సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు. ఇంతకు ఆ సమస్యలు ఏంటి అన్నది ఇపుడు తెలుసుకుందాం.

ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం వలన కొన్ని చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఆ బట్టలు వేసుకున్న వారికి కనుక తామర, గజ్జి వంటి పలు చర్మ సమస్యలు కనుక ఉన్నట్లు అయితే అవి పుచ్చుకున్న వారికి కూడా అంటుకునే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒకరి బట్టలు మరొకరు వేసుకోవడం చేత.. దోషాలు అంటుకుంటాయంట, అలా బట్టలు ఇచ్చిన వారికి మాత్రమే కాదు, కానీ తీసుకున్న వారు మాత్రం దోషాలకు గురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాదు తీసుకున్న వస్త్రాలతో పాటు వారి భావాలు కూడా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. అందుకే ఒకరి బట్టల్ని మరొకరు వేసుకోకూడదు. ఎవరయినా బట్టలు ఇచ్చినా తీసుకోకండి అంటున్నారు.

అందుకే చిన్న చిన్న విషయాలు కూడా ఈజీ గా తీసుకోకూడదు. కొందరు స్త్రీలు అయితే తమ భర్త వాడిన బట్టలను తమ చెల్లెలి భర్తకు లేదా వారి అన్నదమ్ములకు భర్తల అనుమతి తీసుకోకుండానే.. ఇచ్చేస్తూ ఉంటారు. అందుకే దీని వలన కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి.


మరింత సమాచారం తెలుసుకోండి: