రోజుకి కేవలం 32 ద్రాక్ష పండ్లను మాత్రమే తినాలట. అంతకంటే ఎక్కువ తింటే ఇబ్బందులు తప్పవట.మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే రోజుకు 8 నుంచి 10 ద్రాక్ష పండ్లను తినండి. ఇక రాత్రిపూట ద్రాక్ష తినడం వల్ల మీరు బాగా నిద్రపోతారు. ద్రాక్షలో నిద్ర హార్మోన్ మెలటోనిన్ అనేది ఉంటుంది.ఇప్పుడు ద్రాక్ష పండ్లు ఎక్కువగా తింటే కలిగే నష్టాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ద్రాక్షపండులో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. కొన్ని పరిశోధనలు ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుందని తెలుపుతున్నాయి. చక్కెర చాలా ఎక్కువగా ఉండే ఆహారాలు ఖచ్చితంగా విరేచనాలకు కారణమవుతాయి. చక్కెర ఆల్కహాల్స్, చక్కెరలో ఉండే ఆర్గానిక్ సమ్మేళనాలు అతిసారానికి కారణమవుతాయని కొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.అయితే ద్రాక్షలో చక్కెర ఆల్కహాలు ఉన్నాయో లేదో నిరూపించడానికి తగిన ఆధారాలు లేవు.ద్రాక్ష ఎక్కువగా తింటే అలెర్జీ సమస్య వస్తుందట.


ఇక గ్రేప్ లిపిడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటీన్, ద్రాక్షలోని నిర్దిష్ట ప్రోటీన్ అనేవి వ్యక్తులలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుందని కనుగొనబడింది.అలాగే ఒకేసారి ఎక్కువ  ద్రాక్ష తినడం వల్ల కేలరీలు చాలా త్వరగా పెరుగుతాయి. ఎందుకంటే ద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చాలా ద్రాక్షపండ్లను తినడం వల్ల బరువు చాలా ఈజీగా పెరుగుతారని చూపించడానికి ప్రస్తుతం ఎటువంటి దృఢమైన పరిశోధన లేనప్పటికీ, ఎక్కువ ద్రాక్షను తినడం వల్ల ఈ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందట. అందుకే ఎక్కువ కాలం ఈ ద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.చాలా ఎక్కువ పరిమాణంలో ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. చాలా పండ్ల లాగానే , ద్రాక్షలో కూడా ఫైబర్ ఉంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది. ద్రాక్షపండులోని సాలిసిలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఈ రోజులో ఎక్కువ ద్రాక్ష పండ్లను తినడం వల్ల డయేరియా సమస్య చాలా ఈజీగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: