ఈ మధ్య కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. దానికి కారణం సరైన శ్రమ లేకపోవడం, ఆహార పద్ధతులు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి కారణాలు అధిక బరువు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్న ఎలాంటి ప్రయోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ అధిక బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

 వీగన్ డైట్..
 వీగన్ డైట్ అనగా ఎలాంటి జంతు సంబంధిత ఆహార పదార్థాలు వాడకుండా, కేవలం మొక్కల ఆధారిత ఆహార పదార్థాలు మాత్రమే వాడటం వల్ల మన శరీర బరువును ఆరోగ్యకరంగా తగ్గించుకోవచ్చు. విగన్ డైట్ లో,మాంసంలో ఉన్న ప్రోటీన్లను పొందడానికి శాఖాహారంలోని  మష్రూమ్స్ తినడం, క్యాల్షియం పొందడానికి  రాగి ఉత్పత్తులను వాడటం, హిమోగ్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుకోవడానికి పల్లీలను, బీట్రూట్ ని అధికంగా తీసుకోవడం వంటి మొదలగు మార్పులు చేసుకోవడం వంటివి చేయాలి.ఈ డైట్ వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా, మెదడు పెరుగుదలకు మరియు రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది.

 ఇంటర్మీమెటెన్ ఫాస్టింగ్..
ఈ డైట్  కొన్ని గంటలు ఆహారం తీసుకోకుండా శరీరాన్ని కేవలం జీవ క్రియకు జరిగేందుకు మాత్రమే ప్రోత్సహించడం. ఈ డైట్ లో 12 గంటల సమయం ఏమీ తినకుండా ఫాస్టింగ్ ఉండాలి. ఇలా డైట్ చేయడం వల్ల ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. మరియు జీర్ణక్రియా సక్రమంగా జరిగి పొట్ట సమస్యలు దూరం అవుతాయి.అంతేకాక రక్త సరఫరా సక్రమంగా జరిగి గుండెసంబంధిత రోగాలు రాకుండా కాపాడుతుంది.

 ప్రోటీన్ డైట్..
మనం తినే ఆహార పదార్థాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారం పాలు గుడ్లు,చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవడాన్నీ ప్రోటీన్ డైట్ అంటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి అధిక బరువును తొందరగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: