Healthy tips for good health and long life ..
భోజనానికి ముందు బాదం తింటే కలిగే లాభాలు ?

ఇండియాలో కరోనా మహమ్మారి తర్వాత బాదంపప్పుల వినియోగం బాగా పెరిగింది. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం పోషకాహారాన్ని ఖచ్చితంగా తినాలని వైద్యులు సూచించడంతో ఎక్కువ మంది డ్రైఫ్రూట్స్ లని తింటున్నారు.బాదంపప్పును భోజనానికి ముందు తింటే ఖచ్చితంగా చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయని తేలింది.భోజనానికి 30 నిమిషాల ముందు దాదాపు 20 గ్రాముల బాదంపప్పుని కనుక తింటే పోస్ట్ ప్రాండియల్ హైపర్ గ్లైసేమియా లేదా గ్లూకోజ్ స్పైక్ గణనీయం తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఇంకా అలాగే ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగుపడ్డాయి.ప్రీడయాబెటిస్‌ ఉన్న వారు బాదంపప్పుని తినడం వల్ల ఖచ్చితంగా చాలా ప్రయోజనకరమైన ప్రభావాలను పొందుతారని నివేదికలో వెల్లడైంది.సాధారణంగా అందరూ రోజుకు 5 నుంచి 6 బాదంపప్పులను తింటూ ఉంటారు. అయితే ఇది మానవ శరీరానికి చాలా తక్కువని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


ఓ ఆరోగ్యకరమైన మనిషి రోజు 20 గ్రాముల బాదంపప్పు తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే రోజుకు 17 నుంచి 18 బాదంపప్పులను తినాలి.అయితే సాధారణంగా బాదంపప్పును నాణబెట్టి తొక్క తీసి తింటూ ఉంటారు.అయితే పచ్చి బాదం పప్పును తింటే మరింత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బాదంపప్పు పచ్చిగా తింటే అందులోని పోషకాలు చెదిరిపోవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.నానబెట్టిన బాదం పప్పు ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్ల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇంకా అలాగే తొక్క కింద ఉన్న పోషకాలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బాదంపప్పును తింటే ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె జబ్బుల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా బాదం పప్పులని తినండి.ఎల్లప్పుడూ కూడా ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: