నేటి కాలంలో మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు ఇలా వివిధ రకాల నొప్పులతో బాధపడే వారు ఎక్కువవుతున్నారు.చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ఇలా ప్రతి ఒక్కరు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, గంటల కొద్ది కూర్చుని చేయడం, వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు ఇంకా అలాగే సెల్ ఫోన్స్ ను ఎక్కువగా వినియోగించడం వంటి వివిధ కారణాల వల్ల  అనేక రకాల నొప్పుల బారిన పడాల్సి వస్తుంది. చాలా మంది కూడా ఈ నొప్పుల నుండి బయటపడడానికి ఎక్కువగా పెయిన్ కిల్లర్ లను వాడుతూ ఉంటారు.ఇంకా అలాగే అనేక రకాల స్ప్రేలను వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉపశమనం లభించినప్పటికి వీటిని వాడడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కేవలం మందుల ద్వారా మాత్రమే కాకుండా సహజ సిద్దంగా కూడా ఈ నొప్పుల నుండి మనం బయటపడవచ్చు. నొప్పులతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే టిప్స్ పాటించడం వల్ల నొప్పుల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది.


ఈ టిప్ తయారు చేసుకోవడం చాలా సులభం. దీనికోసం మనం ఆవనూనెను ఇంకా ముద్ద కర్పూరాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా ఆవనూనెలో ముద్ద కర్పూరాన్ని వేసి బాగా కలపాలి. తరువాత ఇలా తయారు చేసుకున్న నూనెను నొప్పి ఉన్న భాగంలో రాసి నూనె లోపలికి ఇంకేలా సున్నితంగా మర్దనా చేయాలి. ఆ తరువాత వేడి నీటితో కాపడం పెట్టాలి.ఇక ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి ఇంకా కండరాల నొప్పులు చాలా సులభంగా తగ్గుతాయి. ఇక ఆవ నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులను, వాపులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. నొప్పులతో బాధపడే వారు మందులకు బదులుగా ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఇలాంటి సహజ చిట్కాలను వాడడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: