గతంలో ఎక్కువమంది నేల మీద చాపలు బంతలు పరుచుకొని నిద్రించేవారు.. కానీ ఈ మధ్యకాలంలో మెత్తటి బెడ్లపైన పడుకుంటే హాయిగా నిద్ర పడుతుందని చాలామంది వీటి మీద నిద్రిస్తూ ఉన్నారు. అయితే ఇందుకోసం కొన్ని వేలకు వేలు ఖర్చుపెట్టి మరి బెడ్స్ ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. కానీ బెడ్ పైన కంటే నేలపైన పడుకుంటేనే చాలా మేలు జరుగుతుందని పలువురు వైద్యులు సైతం తెలియజేస్తున్నారు. అలా నేల మీద పడుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


సాధారణంగా భుజం నొప్పి లేదా కండరాలను నొప్పితో ఇబ్బంది పడేవారు నేలపైన పడుకోవాలని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. నిద్ర సమస్యలు ఉన్నవారు కూడా స్లీపింగ్ స్టైల్స్ ని కూడా మార్చుకోవాల్సి ఉంటుందట. వెన్ను నొప్పితో ఇబ్బంది పడేవారు నేల మీద పడుకోవడం మంచిదని తెలియజేస్తున్నారు.. అయితే మెత్తటి పరుపు పైన పడుకోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని తెలుపుతున్నారు. నేల మీద పడుకుంటే వెన్ను నొప్పికి సైతం పెట్టవచ్చని.. అంతేకాకుండా హిప్లెక్సర్లు సైతం ఉపశమనం లభిస్తుందని దీనివల్ల నడుము నొప్పి కూడా తగ్గిపోతుందని తెలిపారు.


సాధారణంగా ఉదయం లేవగానే చాలామంది కాసేపు కూర్చోకుండా లేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆఫీసులో చాలా గంటల తరబడి కూర్చునేవారు.. మెడ నడుము నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఇలాంటివారు నేల మీద పడుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. నేలపైన నిటారుగా పడుకుంటే నడుము నొప్పి మెడ నొప్పి వంటివి తగ్గిపోతాయట.


పనిలో ఒత్తిడి జీవన విధానంలో మార్పుల వల్ల నిద్రలేని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే నేల మీద పడుకోవడం వల్ల అలాంటి ఒత్తిడి తగ్గి మంచి సుఖ నిద్ర పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడే వారికి కూడా ఇది చాలా ఫలితాన్ని అందిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: