
పొద్దు పొద్దున్నే చక చకా పనులు చేసుకుని గంటల గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవడం . బాడీ కీ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడం వల్ల షుగర్ త్వరగా వచ్చేస్తుంది అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు షుగర్ వచ్చిన షుగర్ రాకుండా ఉన్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అని వాళ్ళ ఆరోగ్యం ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అని సూచిస్తున్నారు . మరి ముఖ్యంగా వాకింగ్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నారు . అయితే ప్రీ డయాబెటిస్ పేషెంట్స్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. మనకు ప్రీ డయాబెటిస్ వస్తుంది అని ఎలా గ్రహించాలి అంటే మాత్రం రెండే రెండు సింటమ్స్ ప్రధానంగా కనిపిస్తాయి అంటున్నారు డాక్టర్లు .
మొదటగా ఎక్కువగా యూరిన్ కి వెళ్తూ ఉండడం . మునుపటి మీద ఎక్కువగా యూరిన్ కి వెళ్తూ ఉంటే ప్రీ డయాబెటిక్ విచ్చేసినట్లే అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు చిన్న పని చేసిన అలసిపోయిన ఎక్కువగా చెమట పడుతూ ఉన్న ఎన్ని నీళ్లు తాగిన దాహం తీరకపోయినా ప్రీ డయాబెటిక్స్ ఉన్నట్టే అంటున్నారు డాక్టర్లు . ప్రీ డయాబెటిస్ వచ్చే ముందు ఈ సింటమ్స్ ఎక్కువగా కనిపిస్తాయట. అయితే అలాంటి వాళ్ళు పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు అని ..కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అని .. మరీ ముఖ్యంగా ఉదయం ఇడ్లీ దోశలు కన్నా కూడా రాగిజావ లాంటివి తాగడం ది బెస్ట్ అని అంటున్నారు. అంతేకాకుండా వాకింగ్ అనేది కచ్చితంగా చేయాలి అని చెప్పుకొస్తున్నారు..!