ఏప్రిల్ 27వ తేదీన ఒకసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు...  ఇంకా ఎంతో మంది ప్రముఖులు మరణాలు జరిగాయని ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. 

 

 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి  2001 ఏప్రిల్ 27న అప్పటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదవికి రాజీనామా చేసి శాసనసభ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసారు . ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసి చివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి సారి అధికారాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రెండోసారి కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుని  దూసుకుపోయారు ముఖ్యమంత్రి కేసీఆర్. 

 

 దక్షిణాఫ్రికా స్వాతంత్రం : 1994 ఏప్రిల్ 27వ తేదీన దక్షిణాఫ్రికా దేశానికి స్వాతంత్య్రం లభించింది. 

 

 శామ్యూల్ మోర్స్ జననం : అమెరికన్ ఆవిష్కర్త చిత్రకారుడు మోర్స్ కోడ్ ఆవిష్కర్త ఆయన శ్యామల మోటార్స్ 1791 ఏప్రిల్ 27వ తేదీన జన్మించారు. 

 

 తమ్మల పల్లి అమృత రావు మరణం  : ప్రముఖ నాయకుడు గాంధేయవాది స్వాతంత్ర్య సమరయోధుడు పుణ్య భూమి వార పత్రిక సంపాదకులు అమృతరావు. 1920 ఏప్రిల్ 27వ తేదీన జన్మించారు, మద్య నిషేధం గురించి అప్పటి నుంచి అలుపెరుగని పోరాటం చేశారు, 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మద్యనిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. 1878 తాడికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు తమనపల్లి అమృత రావు. విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారం ప్రారంభించారని 1966 అక్టోబర్ 15న గుంటూరు జిల్లా తాడికొండ లో  నిరాహార దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. 

 

 

 వినోద్ ఖన్నా మరణం : ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత రాజకీయ నాయకుడు అయిన వినోద్ ఖన్నా 2017 ఏప్రిల్ 27వ తేదీన మరణించారు. గుర్దాస్పూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తి వినోద్ ఖన్నా. ఇక బాలీవుడ్ లో దాదాపుగా 140 సినిమాలో పని చేశారు.  2007లో విడుదలైన పాకిస్తానీ చిత్రం గాడ్ ఫాదర్ లా ఉన్న అంటూ  పాత్రలు పోషించారు వినోద్ ఖన్నా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: