మానవ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్ అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్ వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలిగితే, చెడు కొలెస్ట్రాల్ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతూ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో పెరుగుతోందని మన శరీరం మనకు ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు మనం ముందుగానే గమనించుకొని,తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో సమస్యలకు గురవుతాము. చివరికి ఈ అధిక కొలెస్ట్రాల్ వల్ల చాలా మంది మరణం వరకు వెళ్లారు కూడా. మన అవయవాలు చూపించే అలాంటి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

 కళ్ళు..
మన శరీరంలో చెడుకొలెస్ట్రాల్ పెరుగుతోందని మన కళ్ళు మనకి ముందుగానే హెచ్చరికలు ఇస్తాయి.కళ్ళు కింద పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి, క్రమంగా కళ్ళు  మసకగా కనిపించడం, నైట్ బ్లైండ్ నెస్ రావడం,పొడిబారినట్టు అనిపించడం వంటి లక్షణాలు చూపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తూనే, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పరీక్షించుకోవడం ఉత్తమం. లేకుంటే పూర్తిగా కంటి చూపు కోల్పోతామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నాలుక..
అధిక కొలెస్ట్రాల్ పెరుగుతోందని నాలుక కూడా కొన్ని లక్షణాలను చూపిస్తుంది.ముందుగా నాలుక ఉపరితలంపై ఉన్న చిన్న గడ్డలు వచ్చి క్రమంగా పెద్దవిగా మారి,బ్లూ కలర్ లోకీ మారుతాయి. ఇవి మన నాలుకపై వున్న టేస్టింగ్ బడ్స్ వాటి గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి. అంతే కాక నాలుక పిడిచకట్టినట్టు డ్రై గా మారుతుంది.

కాళ్ళు..
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మన శరీరంలోని కాళ్లు కొన్ని లక్షణాలను చూపిస్తాయి. అందులోని ముఖ్యంగా కాళ్లలోని రక్త సరఫరా దెబ్బతిని, కాళ్ల నరాలు ఉబ్బినట్టు అవుతాయి. దీనితో రక్తసరఫరా సరిగా జరగక కాళ్ల నొప్పులు, పాదాలు నిర్జీవంగా మారినట్టు అనిపిస్తూ ఉంటుంది. దీనితో కొంచెం దూరం నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.

కావున చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి తగిన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి అలవార్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: