గంజి అంటే అన్నం ఉడికేటప్పుడు ఎక్కువగా ఉన్న నీటిని బయటకి తీసి వేస్తూ ఉంటారు. దీనిని గంజి అని పిలుస్తూ ఉంటారు. మన ఇళ్లల్లో ఉన్న పెద్దవారికైతే ఈ విషయం బాగా తెలుస్తుంది వారు అప్పట్లో ఎక్కువగా గంజినే తాగుతూ ఉండేవారు. ఈ గంజి తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తూ ఉంటారుm ఈ గంజిని తాగినప్పుడు కడుపు నిండిన భావనతో కలిగి ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గంజిలో ఎన్నో పుష్కలమైన న్యూట్రియన్స్ ఉంటాయి ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.


అమైన ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, వంటివి ఇందులో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి సి మినరల్స్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ గంజిని తాగడం వల్ల జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఫుడ్ పాయిజన్, డయేరియా,అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఈ గంజి నీటిని తాగితే కడుపులో ఆసరాగా ఉంటుంది.ఇందులో ఉండే విటమిన్స్ మనిషికి చాలా శక్తిని కలిగిస్తాయి. ముఖ్యంగా ప్రేగు కదలికలో మెరుగ్గా పనిచేసేందుకు ఇందులో ఫ్రీ బయోటిక్స్ ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

బియ్యం నీటిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుచేతనే అవి గంజిలోకి వస్తాయి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శక్తి స్థాయి తిరిగి పొందుతుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉపవాసం ఉన్నవారు కచ్చితంగా ఉదయం పూట గంజిని తాగుతూ ఉంటారు దీంతో తక్షణమే శక్తిని పొందవచ్చు. జ్వరం ఇన్ఫెక్షన్తో బాధపడేవారు గంజిని తాగడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుంది. అయితే గంజిని తాగే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికిన తర్వాతనే గంజిని తీసుకోవడం మంచిది. బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత పొయ్యి మీద ఉంచడం మరచిపోకూడదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా రసాయనిక ఎరువులతోని బియ్యాన్ని పండిస్తున్నారు. ప్రతి ఒక్కరు గంజిని తాగడం వల్ల పలు ప్రయోజనాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: