జీవితంలో ఎప్పుడైనా మన సొంత అవగాహన మనకు ఉండాలి. అంతే కానీ ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మేయకూడదు.. ప్రభావితం కాకూడదు. ఎవరైనా ఏదైనా చెప్పినా.. దానిలో మంచి చెడు బేరీజు వేసుకోవాలి. మనకంటూ సొంత అభిప్రాయం ఉండాలి. అలా కాకుండా ఊరికే చెప్పుడు మాటలు వింటే జీవితంలో ఎంతో కీడు జరుగుతుంది.

 

 

ఇందుకు చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీ క్రిష్ణ దేవరాయలు.. తన సొంత ఖర్చులు కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.. తల్లి గర్భంలో చనిపోబోయే బిందుసారుడిని తన ఉపాయంతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు

 

 

 

చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుని.. అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు.. అంతేనా.. చెప్పుడు మాటలు విని రావణబ్రహ్మ అంతటి మాహాజ్ఞానే సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు.. కడకు మరణించాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: