ప్రేమ.. ఈ ప్రపంచం అంతా ఈ అద్భుత భావన చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రేమ అంటే ముందుగా గుర్తొచ్చేది యువతీ యువకుల ప్రేమే అయినా... అసలైన ప్రేమ అందుకే పరిమితం కాదు. స్వచ్ఛమైన ప్రేమ శాంతిని కోరుతుంది. అందుకే ప్రేమ మూర్తులు గొడవలకు దూరంగా ఉంటారు. 

ప్రేమకు హద్దులు ఎల్లలు లేవు. ప్రేమ ఉన్నచోట అపోహలకు, అనర్థాలకు తావుండదు. ప్రేమ మార్గంలో ఉన్నవారు.. ఎవరినీ ద్వేషించరు. అంతా మన వాళ్లే అనుకుంటారు. ప్రేమ మార్గంలో ఉన్నవారికి  పెద్దలంతా గౌరవనీయులు, తోటివారంతా  స్నేహితులు.. ఇక  చిన్నవారంతా ప్రీతిపాత్రులు అంతే. ఇక భగవత్‌ ప్రేమ గురించి చెప్పేదేముంది..

 

భగవంతుడు ప్రేమ స్వరూపుడు. ఆయన స్వరూపం తెలుసుకోవాలంటే మనసు నిండా ప్రేమను నింపుకోవాలి. అందరినీ సమదృష్టితో ప్రేమించాలి. ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకున్నవారికి ఆగ్రహావేశాలు, ఈర్ష్యాద్వేషాలు ఉండవు.  ప్రేమ అనే రెండక్షరాల్లోనే అద్భుతమైన ఆకర్షణ ఉంది. 

 

ప్రేమ.. శత్రువును మిత్రుడిగా మార్చగల శక్తి ఉంది. ప్రేమ.. మనిషి తన జీవితంలో ఏదైనా సాధించాలంటే అది ప్రేమతోనే సాధ్యపడుతుంది. ప్రేమంటే ఒక పవిత్రభావన. మధురమైన మానసిక స్థితి. ప్రేమించే అన్ని హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. ప్రేమ నిండిన మనసు ఓ దేవాలయం. ప్రేమించే మనసు ఉంటే ఈ ప్రపంచమే ఓ ప్రేమాలయం.

 

ప్రేమ‌కు లొంగ‌నిది ఈ ప్ర‌పంచంలో ఏది ఉండ‌దు. ఎంత‌టి మూర్ఖుడైనా కాసింత ప్రేమ చూపిస్తే చాలు వారి మ‌న‌సు ఎక్క‌డో ఒక‌చోట అయినా క‌రుగుతుంది. అంత శ‌క్తి వంత‌మైన‌ది ప్రేమ‌. దేన్నైనా..ఎటువంటి వాళ్ళ‌నైనా లొగ‌దీయ‌గ‌ల శ‌క్తి ఈ భూ ప్ర‌పంచంలో ఒక్క ప్రేమ‌కే సాధ్యమ‌వుతుంది. మ‌నం కూడా ఇత‌రుల‌ను నిత్యం ప్రేమిస్తూ ఉంటే ఎటువంటి స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌వు. ఇది ఆరోగ్య‌క‌రంగా కూడా చ‌లా మంచి విష‌యం అని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: