చలికాలంలో హార్ట్ ఎటాక్‌ కేసులు బాగా పెరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. నాడీ వ్యవస్థపై చలి చూపించే దుష్ప్రభావం, రక్త నాళాలపై పడే ప్రభావం కారణంగా హార్ట్ ఎటాక్‌లు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే పొద్దున జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  చలికాలంలో నీరు తాగడం పూర్తి తగ్గించేస్తుంటారు. అయితే కాలం ఏదైనా నీటిని తాగడం మాత్రం ఆపొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో నీరు తక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అసలు ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పొద్దున నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా కూడా నీరు తాగకుండా ఉండి ఉదయం కూడా ఎక్కువ సేపు నీరు తాగకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్రలేవగానే దాహంగా లేకపోయినా ఖచ్చితంగా నీరు తాగాలని, ఎందుకంటే దీనివల్ల మెటాబాలిజం ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు.


సహజంగా చలికాలం అనగానే శారీరక శ్రమ తగ్గిపోతుంది. వాకింగ్, జాగింగ్ చేసే వారు కూడా చలి వల్ల ఇంట్లోనే ఉండిపోతారు. అయితే శరీరాన్ని వేడెక్కించేందుకు వ్యాయామాలు నిత్యం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో  చిన్నచిన్న వర్కవుట్స్‌ చేయాలని సూచిస్తున్నారు. స్ట్రెచ్చింగ్‌ వంటి వ్యాయామాల వల్ల రక్త సరఫరా పెరిగి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అలాగే చలికాలం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ విషయంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే అల్పాహారంలో పండ్లు, తృణధాన్యాలు ఇంకా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి వాటిని భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల తక్షణం శక్తి లభించడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.దీంతో గుండె ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: