వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ పుచ్చకాయ ఎక్కువ ప్రిఫరెన్స్ ని ఇస్తారు. వేసవికాలంలోనే ఈ పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి. పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ అంటే ఇష్టం లేనివారు ఎవ్వరు ఉండరు. పుచ్చకాయలు అనేక విటమిన్లు, కనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లడ్ షుగర్ తో బాధపడుతున్న వారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది.

 షుగర్ ఉన్నవారు పుచ్చకాయని తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే పుచ్చకాయ ఎక్కువ స్వీట్ గా ఉంటుంది. కాబట్టి ఇది షుగర్ ఉన్న వారు తినటం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. పుచ్చకాయలు అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలు గ్లైసమిక్ సూచీ తక్కువగా ఉంటుంది. గ్లైసమిక్ సూచీ తక్కువగా ఉంటే రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. తాజా పుచ్చకాయ తినొచ్చు కానీ పుచ్చకాయ రసం మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. పుచ్చకాయను తగిన పరిమాణంలో తీసుకుంటే అది మధుమేహం లో కూడా ఎటువంటి హాని కలిగించదు.

పుచ్చకాయలో విటమిన్ ఎ, బి1, బి6, సి, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, లైకోపిన్ కూడా ఉన్నాయి. పుచ్చకాయను అల్పాహారం గా లేదా మధ్యాహ్నం భోజనానికి కూడా తినొచ్చు. షుగర్ ఉన్న వారు కూడా తినొచ్చు కానీ మరి ఎక్కువగా తినటం మంచిది కాదు. మరి ఎక్కువగా తినడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుచ్చకాయ తిన్న తర్వాత పొట్ట చల్లగా ఉండటం చాలామందికి తెలిసే ఉంటుంది. చల్లబడటానికి ఈ పుచ్చకాయను మరి ఎక్కువగా తింటూ ఉంటారు. పుచ్చకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో ఇది చాలా మంచిది. పుచ్చకాయలు వేసవికాలంలోనే కానీ మిగతా సీజన్లో అస్సలు దొరకవు. ఈ సీజన్లోనే పుచ్చకాయలని తినాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు కానీ మరీ ఎక్కువగా తినకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: