
మరి ముఖ్యంగా భార్యాభర్తలు అన్నాక కొంచమైన ప్రైవసీ ఉండాలి అని ..సీక్రెసి మెయింటైన్ చేయాలి అని.. ఏదైనా గొడవ జరిగితే అమ్మాయి వాళ్ళ అమ్మ గారికి ఫోన్ చేసి మొత్తం చెప్పేస్తుంది. తద్వారా మూడో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రావడం కారణంగానే ఆ చిన్న గొడవ పెద్దదిగా మారి విడాకులు తీసుకునే వరకు వెళ్తుంది అని కొందరు అంటుంటే . మరి కొందరు అసలు వాళ్ళకి పెళ్లి అన్న బంధం మీద నమ్మకం లేదు అని మోజు తీరడానికి మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు అని రకరకాలుగా స్పందిస్తున్నారు . కానీ ఎక్కువ శాతం మంది మాత్రం అసలు పెరిగిపోతున్న వర్క్ ప్రెజర్ కి భార్యాభర్తలు కలిసి కూర్చొని పట్టుమంటే ఒక పది నిమిషాలు కూడా మాట్లాడుకోవడం లేదు అని.. ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు అని ఆ కారణంగానే వాళ్లు మధ్య దూరం అనేది ఇంకా పెరిగిపోతూ వస్తుంది అని చెప్తున్నారు .
అంతేకాదు మరీ ముఖ్యంగా విడాకులు తీసుకుంటున్న వాళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు టాప్ పొజిషన్లో ఉండడం అందరికీ షాకింగ్ గా ఉంది. ఇద్దరు భార్యాభర్తల ఉద్యోగాలు చేస్తూ ఉంటే కచ్చితంగా వాళ్లకు వర్క్ ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి . ఆ సమయంలో వాళ్ళు తమ వైవాహిక జీవితం పై కాన్సెంట్రేషన్ చేయలేకపోయినా ..తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఇక టోటల్ కొలాప్స్ . పెళ్లి బంధమే స్పాయిల్ అయిపోతుంది. దానికి తగ్గట్టే ఇప్పుడు అక్రమ సంబంధాలు కూడా ఎక్కువైపోతున్నాయి . చాలామంది మాత్రం భార్య భర్తలకి కొంచెం ప్రైవసి ఉండాలి అని .. ఎంత వర్క్ ప్రెజర్ లో ఉన్న వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేయాలి అని భర్తతో భార్య.. భార్యతో భర్త మనసు విప్పి మాట్లాడుకుని మా ప్రాబ్లం ఇది మన ప్రాబ్లం ఇది అని షేర్ చేసుకుంటే అసలు ఈ విడాకులు అన్న మాటే రాదు అని అంటున్నారు.
కానీ ఈ మధ్యకాలంలో ఎవరు కూడా కపుల్స్ అలా చేయడం లేదు. అంతేకాదు చాలామంది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి "మీరు మీ భర్తతో కానీ భార్యతో కానీ ఎంత సమయం గడుపుతున్నారు ..? అయితే మొబైల్ ఫోన్ లేదంటే టీవీ ఆన్ చేసి సినిమాలు , వెబ్ సిరీస్ లు..ఇవి తప్పిస్తే మీ హెల్త్ గురించి కానీ.. మనసు విప్పి మీ భాగ్య స్వామితో మాట్లాడడం గురించి గానీ ఆలోచిస్తున్నారా ..?"అంటూ ఘాటుగానే పెద్దలు అడిగేస్తున్నారు. నిజమే ఈ మధ్యకాలంలో చాలామంది వర్క్ ప్రెజర్ కారణంగా భార్య భర్తలు టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. ఉన్న కొంచెం టైం కూడా మొబైల్ కే కేటాయిస్తున్నారు తప్పిస్తే తమ లైఫ్ పార్టనర్ కి కేటాయించడం లేదు. రాత్రి అయితే చాలు బెడ్ పై ఫోన్లు పట్టుకొని రీల్స్ ..ఇన్స్టా లు ఫేస్బుక్ లు అంటూ టైం పాస్ చేస్తున్నారు తప్పిస్తే మనసు విప్పి మాట్లాడుకోవడం లేదు అంటూ చాలామంది భార్యాభర్తలు ఓపెన్ గానే తమలో ఉన్న తప్పులను ఒప్పేసుకుంటున్నారు..!