చాలామంది నీరు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి అంతా మంచిది కాదు. జీర్ణ క్రియ కు సహాయపడడానికి భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీరు తాగాలి. భోజనానికి ముందు లేదా తర్వాత చాలా త్వరగా తాగకూడదని గుర్తించుకోండి. ఎందుకంటే నీరు జీర్ణ రసాలను పలుచన చేస్తుంది. ఆహారం తీసుకున్నా ఒక గంట తర్వాత నీరు తాగడం వల్ల శరీరం పోషకాలను గ్రహించేలా చేస్తుంది. శరీరానికి తగినంత నీరు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. నీరు హైడ్రాయిడ్ గా ఉండడమే కాకుండా శరీరా ఉష్ణోగ్రతను నియంతరిస్తుంది. మూత్రపిండాల నుంచి వ్యర్థాలను బయటకు పంపడం, 

లాలాజలాన్ని సృష్టించడం, వివిధ శరీర భాగాలకు పోషకాలను అందుబాటులో ఉంచడం వంటి అనేక శారీరక విధులను నిర్వహిస్తుంది. కొన్నిసార్లు ఆకలిగా అనిపించినప్పుడు నీరు తాగుతూ ఇది ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా చేస్తుంది. చమట పట్టినప్పుడు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది. శరీరాన్ని హైడ్రాయిడ్ గా ఉంచుకోవడానికి ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం ముఖ్యం. తలనొప్పి ఉన్నప్పుడు కూడా నీరు తీసుకోవాలి. అనారోగ్యంతో ఉన్నప్పుడు నీరు తీసుకోవడం ముఖ్యం. ఇది శరీరానికి హైడ్రేట్ గా ఉంచుతుంది.

 నిద్ర లేవగానే కూడా ప్రీ ఫ్రెష్ గా ఉండేందుకు నీరు తాగాలి. ఇది మానసిక స్థితిని, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అలసట అనిపించకపోయినా నీరు తీసుకోవాలి. మీరు తాగడానికి అనువైన సమయం ఉంటుంది. భోజనంతో పాటు ఎప్పుడు నీరు తాగకూడదు. భోజనంతో పాటు ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువ నీరు తీసుకుంటే మీ జీర్ణశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా మార్చడానికి కారణం అవుతుంది. కావాలంటే మీ భోజనంతో పాటు కొంచెం నీరు తాగితే చాలు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా నిద్ర లేవగానే కనీసం ఒక గ్లాస్ నీరు తాగాలి. ఇది వ్యాధులతో పోరాటానికి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: