పిస్తా అనేది మిగతా డ్రై ఫ్రూట్స్‌లో కన్నా ప్రత్యేకమైన పోషక విలువలతో నిండిన ఆరోగ్యవంతమైన ఆహారం. చాలామంది పిస్తాను రోజూ తినే అలవాటు కలిగి ఉంటారు. కానీ దీని లాభాలు, నష్టాలు, తినే సరైన విధానం, పరిమితి గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు మరింత జాగ్రత్తగా, ఆహ్లాదకరంగా దీన్ని మీ డైట్‌లో చేర్చుకోవచ్చు. పిస్తాలో ఉండే మోనో అసంతృప్త కొవ్వులు హార్ట్ బీట్ ని క్రమంగా ఉంచుతాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతుంది. అందుకే హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తక్కువ అవుతాయి. పిస్తా తక్కువ కాలరీలతో, ఎక్కువ ఫైబర్ మరియు ప్రొటీన్లతో నిండివుంటుంది.

తక్కువ పరిమాణంలో తిన్నా త్వరగా నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువగా తినకుండా నియంత్రించవచ్చు. మెటబాలిజం ను స్పీడ్ చేస్తుంది. రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. పిస్తాలో ఇనుము, ఫోలేట్ ఉన్నాయి. ఇవి హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడతాయి. మహిళల్లో అనిమియా నివారణకు ఇది మంచి సహాయకారం. పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ E ఉన్నాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచి, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. లూటిన్ మరియు జీయాక్సాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాలో ఎక్కువగా ఉంటాయి.

ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వృద్ధాప్యంలో వచ్చే మాక్యులర్ డిజనరేషన్ ను నివారించగలుగుతుంది. జింక్, సెలీనియం వంటి ఖనిజాలు పిస్తాలో ఉండటం వల్ల పురుషుల్లో శుక్రకణాల నాణ్యత మెరుగవుతుంది. హార్మోన్ల స్తాయిలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. ఎక్కువ పిస్తా తింటే పెరిగిన కొవ్వు, అధిక ప్రోటీన్ వల్ల జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, యూరిక్ యాసిడ్ సమస్యలు రావచ్చు. రోజుకు 10–15 పిస్తాలు మాత్రమే తినడం మంచిది. మార్కెట్లో దొరికే ఉప్పు కలిపిన పిస్తాలు ఎక్కువగా తీసుకుంటే సోడియం స్థాయి పెరిగి బీపీ, కిడ్నీ సమస్యలు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: